హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 5 శాతం డీఏ పెంపు.. 48 వేల మందికి లబ్ది

|
Google Oneindia TeluguNews

టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం తీసి క‌బురు చెప్పింది. ఉద్యోగుల‌కు వేత‌నాల‌కు 5 శాతం డీఏ ఇవ్వనుంది. పెంచిన డీఏ వచ్చె నెల నుంచి క‌లిపి ఇస్తామని టీఎస్ ఆర్టీసీ ప్ర‌క‌టించింది. మూల వేత‌నంపై 5 శాతం డీఏ చెల్లిస్తామని ఆర్టీసీ ప్రకటించింది. దీంతో సంస్థ‌పై నెల‌కు రూ.5 కోట్ల భారం ప‌డ‌ుతుందని వెల్ల‌డించింది.

మూల వేత‌నంపై ఉద్యోగులందరికీ 5 శాతం డీఏ చెల్లించ‌నుంది. డ్రైవర్, కండక్టర్, శ్రామిక్ వంటి యూనిఫారం ఉద్యోగులకు కనిష్ఠంగా రూ.600 నుంచి గరిష్ఠంగా రూ.1,500 వరకు భత్యం జతకలువనుంది. వివిధ కేటగిరీల్లోని అధికారులకు రూ.1,500 నుంచి రూ.5,500 వరకు వేతనం అడిషనల్‌గా జమ కానుంది. డీఏ పెంపుతో ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

5 per cent da increased in the rtc employees

ప్రస్తుతం ఆర్టీసీలో పనిచేస్తున్న 48 వేల మందితోపాటు 2019 జూలై నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. ఇటీవల బోర్డు సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఒక్కొక్కటి అమలు చేస్తుంది. ఆర్టీసీ చార్జీలను రౌండ్‌ ఫిగర్‌ చేయడం, డీజిల్‌ సెస్సు విధించడం ద్వారా సంస్థ ఆదాయం స్వల్పంగా పెరగడంతో కార్మికుల సంక్షేమంపై దృష్టిసారించింది. పెండింగ్‌లో ఉన్న 6 డీఏల్లో ప్రస్తుతానికి ఒకదాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

English summary
5 per cent da increased in the rtc employees. total 48 thousand employees are benefit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X