హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ అవినీతికి పాల్పడలే.. కావాలనే ఏసీబీ దాడులు: అతని భార్య, ఎఎస్పీ లక్ష్మి

|
Google Oneindia TeluguNews

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్‌ఎండీఏ విజిలెన్స్‌ మాజీ డీఎస్పీ జగన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. 38 గంటల పాటు అధికారులు సోదాలు నిర్వహించారు. హెచ్‌ఎండీఏలో పని చేస్తున్న సమయంలో అక్రమాలు చేసినట్లు జగన్‌పై ఆరోపణలు వచ్చాయి. జగన్‌తో పాటు అతని బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. బోడుప్పల్‌, కొర్రెముల, జోడిమెట్లలో జగన్‌ వెంచర్‌ వేసినట్లు.. బినామీ పేరుతో పెట్రోల్‌ బంకు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

 acb raids ends in ex dsp jagan house

ఏబీసీ దాడులపై మాజీ డీఎస్పీ జగన్ భార్య, అడిషనల్ ఎస్పీ లక్ష్మి స్పందించారు. తమ ఇంట్లో ఏసీబీ దాడులు దురుద్దేశ పూర్వకంగా జరిగాయని ఆరోపించారు. అప్పట్లో ఏసీబీ అధికారిగా పని చేసిన అచ్యుత్ రావు తమపై పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకుని దాడులు చేయించారని చెప్పారు. తన భర్త జగన్ అవినీతికి పాల్పడ లేదన్నారు. ఇటీవల తమ బంధువుల వివాహం జరగడంతో బంధువుల బంగారం తమ ఇంట్లో ఉందన్నారు. హెచ్ఎండీఏలో డీఎస్పీగా పని చేస్తుండగా కోటేశ్వర్ రావు కు ఫేవర్ చేయాలని అచ్యుత్ రావు అడిగారని, దానికి నిరాకరించడంతో జగన్ పై కక్ష పెట్టుకుని దాడులు చేయించారని చెప్పారు. కొర్రెములలో తమకు ఎలాంటి ల్యాండ్ లేదని తేల్చి చెప్పారు. తమ ఇంట్లో కేవలం రూ.80వేలు మాత్రమే దొరికాయని, తమకు ఎలాంటి డబ్బు ఆశ లేదన్నారామె. ఏసీబీ అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని లక్ష్మి చెప్పారు.

Recommended Video

తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పీఈటీ టీచర్లు!!

HMDA విజిలెన్స్ విభాగంలో డీఎస్పీగా పని చేసిన జగన్ ను ఏసీబీ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. 2019లో జగన్ ను హెచ్ఎండీఏ విజిలెన్స్ విభాగం నుండి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. తాజాగా ఓపెన్ ప్లాట్ విషయంలో కోటేశ్వర్ రావు అనే వ్యక్తి నుండి రూ. 4 లక్షలు తీసుకున్నారని జగన్ పై ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ హబ్సిగూడలోని జగన్ ఇంటితో పాటు ఆయన సమీప బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. జగన్ ఇంట్లో సుమారు కిలో బంగారంతో పాటు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.

English summary
acb raids ends in ex dsp jagan house in bribery charges. his wife told to media he is innocent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X