హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇవాళ రఘు.. రేపు మరొకరు, అరెస్ట్‌పై భగ్గుమన్న బండి సంజయ్, గొంతు నొక్కేయడమే

|
Google Oneindia TeluguNews

యాంకర్ రఘు అరెస్ట్‌పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. ఈ రోజు రఘుకు జరిగిందే రేపు మరో జర్నలిస్టుకు జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. గుర్రంపోడు తండా వద్ద ఘర్షణలకు ఆజ్యం పోశాడని, పోలీసులపై దాడులకు కారకుడయ్యాడని ఆరోపిస్తూ రఘుపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రఘును హుజూర్ నగర్ కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం రఘు హుజూర్ నగర్ సబ్ జైలులో ఉన్నారు.

లోపాలను ఎత్తిచూపితే..

లోపాలను ఎత్తిచూపితే..

సీనియర్ జర్నలిస్టు రఘు అరెస్ట్‌ను ఖండిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపితే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూర్ నగర్ నియోజకవర్గం గుర్రంపోడు తండా గిరిజన భూములను అధికార పార్టీ నేతలు ఆక్రమిస్తే ఆ భూభాగోతాన్ని మీడియాలో చూపించినందుకు రఘుపై కేసు నమోదు చేశారని బండి సంజయ్ ఆరోపించారు.

బాధ్యత నెరవేరిస్తే.. ఇలానా..?

బాధ్యత నెరవేరిస్తే.. ఇలానా..?

ప్రజాస్వామ్యంలో అవినీతి, అక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడమే మీడియా బాధ్యత అని పేర్కొన్నారు. అక్రమ కేసులతో మీడియా గొంతును మూసి వేయాలని ఈ ప్రభుత్వం భావిస్తోందని విమర్శించారు. అధికార పార్టీ నేతల కబ్జాలపై వార్తలు రాస్తే కేసులు పెడతామని కేసీఆర్ సర్కారు సంకేతాలను ఇస్తోందని విమర్శించారు. వాస్తవాలను రాసే జర్నలిస్టులపై కేసులు పెడితే జైళ్లన్నీ వాళ్లతోనే నిండిపోతాయని, అందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా అని బండి సంజయ్ ప్రశ్నించారు.

అమానుష చర్యలే

అమానుష చర్యలే

ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం మీడియా.. ప్రతినిధులపై ఈ అమానుష చర్యలేంటి అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ సాధనలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని, అలాంటిది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుని 24 గంటలు గడవకముందే ఒక సీనియర్ పాత్రికేయుడ్ని అరెస్ట్ చేస్తారా అని సంజయ్ నిలదీశారు.

Recommended Video

Popular Telugu YouTube Host #TNR Lost Life | Oneindia telugu
అరెస్ట్‌కు కారణమిదే..?

అరెస్ట్‌కు కారణమిదే..?

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా 540 సర్వే నంబర్ ఘర్షణ జరిగింది. ఈ కేసులో నిందితుడిగా జర్నలిస్ట్ రఘు ఉన్నారు. ఆయనను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత హుజుర్‌ నగర్ జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. తర్వాత అతనిని హుజూర్ నగర్ జైలుకు తరలించారు. జర్నలిస్టులలో డేరింగ్ అండ్ డాషింగ్ గా రఘుకి పేరుంది. అంతకుముందు రఘు మోజో టీవీలో పనిచేశారు. 10 టీవీ.. రాజ్ న్యూస్‌లో కూడా వర్క్ చేశారు.

English summary
bjp state chief bandi sanjay reacts about journalist raghu arrest. this is not fair to the telangana government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X