హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త జోన్ల ప్రకారమే ఉద్యోగుల విభజన, కిలో వడ్లు కూడా కొనం.. కలెక్టర్లకు కేసీఆర్ ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

కలెక్టర్లతో సమావేశంలో కీలక అంశాలను సీఎం కేసీఆర్ వివరించారు. ఉద్యోగుల విభజన, దళిత బంధు, యాసంగిలో పంట కొనమని స్పష్టంచేశారు. కొత్త జోన‌ల్ విధానం ప్ర‌కార‌మే ఉద్యోగుల విభజన చేపట్టాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక యువతకు ఉద్యోగుల కల్పనతోపాటు క్షేత్ర స్థాయిలోకి ప్రభుత్వ పాలన, నూతన జోనల్ వ్యవస్థతో అమలులోకి వస్తుందని తెలిపారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో సీఎం కేసీఆర్ స‌మావేశ‌మై ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు.

 అక్కడ కూడా విధులు

అక్కడ కూడా విధులు

మారుమూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేయగలిగితే సమగ్రాభివృద్ధి సాధ్యమని సీఎం కేసీఆర్ అన్నారు. నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేసి నివేదికను అందజేయాలని ఆదేశించారు. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులు అయితే ఒకే చోట విధులు నిర్వ‌ర్తిస్తేనే వారు ప్రశాంతంగా పనిచేయ గలుగుతరని సీఎం పేర్కొన్నారు. స్థానిక యువత ఉద్యోగాలకు విఘాతం కలగకుండా మానవీయ కోణంలో స్పౌస్ కేస్ అంశాలను పరిష్కరించాలని సీఎం సూచించారు.

కిలో కూడా కొనం

కిలో కూడా కొనం


ఇటు యాసంగిలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేసీఆర్ మరోసారి స్పష్టంచేశారు. యాసంగిలో రైతుల నుంచి ఒక్క కిలో వడ్లను కొనేదిలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం.. యాసంగి వడ్లు కొనడం లేదని.. అందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలను సైతం ఏర్పాటు చేయడం లేదని స్పష్టం చేశారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని చెప్పారు. యాసంగి ధాన్యాన్ని కొనబోమనే విషయాన్ని రైతులకు తెలియజెప్పాలని.. వారికి అర్థమయ్యేలా వివరించాలని కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.

కేంద్రాలు ఉండవు

కేంద్రాలు ఉండవు

యాసంగి విషయంలో ధాన్యం కొనుగోలు చేసే ప్రసక్తే లేదంటూ కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయబోమని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో ఒక కిలో ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయబోమని సీఎం మరోసారి పునరుద్ఘాటించారు. దీనికి సంబంధించి కేసీఆర్ మరోసారి ప్రకటన చేయడంతో కలెక్టర్లు కూడా అప్రమత్తం అయ్యారు. కలెక్టర్లకు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కలెక్టర్లు కూడా ప్రజల్లోకి వెళ్లి, క్షేత్రస్థాయిలో తిరిగి వచ్చే ఏడాదికి సంబంధించి ధాన్యం కొనబోమని తెలపాలని కోరారు.

 ప్రమాదకర విధానాలు

ప్రమాదకర విధానాలు

కేంద్ర ప్రభుత్వం ప్రమాదకర విధానాలను అనుసరిస్తుందని సీఎం కేసీఆర్ విమర్శించారు. యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో యాసంగిలో ఇక వరి పంట వేయొద్దని సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. దానికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించారు. దీనిపై ప్రజలు, రైతులకు అవగాహన కల్పించాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు కృషి చేయాలని సూచించారు. ధాన్యం విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్ర రైతాంగం నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు, రైతుల్లో అవగాహన కల్పించడం ద్వారా రైతులను కాపాడుకున్న వారిమి అవుతామని కలెక్టర్లకు సూచించారు.

దళితబంధుకు నిధులు

దళితబంధుకు నిధులు

ఇటు త్వరలో దళితబంధు నిధులను విడుదల చేస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. దళితబంధుపై అధికారులతో కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని కోరారు. తెలంగాణలో దళిత సమాజం తలెత్తుకునేలా ఉండాలన్నారు. దళితబంధును ఇప్పటికే అమలు చేస్తున్నామని వివరించారు. హుజురాబాద్‌తోపాటు మరో 4 మండలాల్లో దళితబంధును అమలు చేస్తున్నామని తెలిపారు.

English summary
employees division is new zone model cm kcr clarifies to district collector. in yasangi one kg paddy also not buying.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X