ఫస్ట్ కేసు కేసీఆర్‌పై పెట్టాలి, కల్వకుంట్ల ఫ్యామిలీకి భయం పట్టుకుంది: కిషన్ రెడ్డి
ఎమ్మెల్యేల కొనుగోలు అంశం హీటెక్కిస్తోంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. సీఎం కేసీఆర్, కల్వకుంట్ల ఫ్యామిలీపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలోకి వస్తోందని సంచలన కామెంట్స్ చేశారు. కొత్త ప్రభుత్వం లొసుగులపై దర్యాప్తు చేస్తుందనే భయం కేసీఆర్‌ను వెంటాడుతోందని కిషన్ రెడ్డి అన్నారు. సీఎం పదవీ పోతుందని కల్వకుంట్ల ఫ్యామిలీకి భయం పట్టుకుందని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ఫస్ట్ కేసు కేసీఆర్‌పై పెట్టాలని సూచించారు. దొరికిన డబ్బులు ఏమయ్యాయని అడిగారు. ఘటనపై సీబీఐ విచారణ కోరుతున్నామని తెలిపారు. లేదంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని కోరారు. అప్పుడే నిజ నిజాలు వెలుగులోకి వస్తాయని వివరించారు. ఐటీ, ఈడీ, సీబీఐ దాడుల పేరుతో సానుభూతి పొందాలని అనుకుంటున్నారని విరుచుకుపడ్డారు. నందకుమార్‌తో టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చాలా మంది ఫోటోలు దిగారు. మీకు నాలుగు ఆర్‌లు నిద్రలేకుండా చేస్తున్నారని కేసీఆర్‌పై ఫైరయ్యారు.

టీఆర్ఎస్ సోషల్ మీడియాలో..
ఆ ముగ్గురితో బీజేపీకి ఏం సంబంధం ఉందని కిషన్ రెడ్డి అడిగారు. ఫామ్ హౌస్‌కు పోలీసులు వెళ్లకముందే.. టీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్టులు సిద్దం అయ్యాయని తెలిపారు. నలుగురు ఎమ్మెల్యేలతో ప్రభుత్వం కూలిపోతుందా అని అడిగారు. తమకు ఇప్పుడేం తొందర లేదని.. 2023 వరకు ఆగుతామని చెప్పారు. కొందరు పోలీసులు దిగజారి ప్రవర్తిస్తున్నారని కిషన్ రెడ్డి ఫైరయ్యారు.

12 మంది ఎమ్మెల్యేలు ఎలా..?
మునుగోడులో ఓటమి తప్పదని టీఆర్ఎస్ డ్రామాలు చేస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. ఓడిపోతామని వింత నాటకాలు చేస్తున్నారని ఫైరయ్యారు. ఇదీ ముమ్మాటికీ టీఆర్ఎస్ కుట్ర అని ఫైరయ్యారు. ఫిరాయింపులను ప్రోత్సహించేది టీఆర్ఎస్ పార్టీయేనని చెప్పారు. రాజీనామా చేయించకుండా ఇతర పార్టీ నేతలను ఆహ్వానించారని.. కొందరికీ మంత్రి పదవులు కూడా దక్కాయని తెలిపారు. తమను బ్రోకరిజం అంటోన్న ఇంద్రకరణ్ రెడ్డి ఏ పార్టీ నుంచి పోటీ చేశారని అడిగారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన 12 మంది ఎమ్మెల్యేలను ఏ ప్రాతిపదికన చేర్చుకున్నారు.. ఎంతమ మందికి పదవులు ఇచ్చారని అడిగారు. మండలిలో కూడా కాంగ్రెస్ నేతలను కొనుగోలు చేయలేదా అని అడిగారు.

ఆడియో టేపులు తయారు కాలేదట
ఇష్యూపై బండి సంజయ్ కూడా మాట్లాడారు. ఇదీ టీఆర్ఎస్ పార్టీ డ్రామా అని అన్నారు. ఇప్పటికీ ఆడియో టేపులు తయారు కాలేదట అని సెటైర్లు వేశారు. ఫామ్ హౌస్‌కు సంబంధించి తమకు సీసీటీవీ ఫుటేజీ కావాలని అడిగారు. ఫోన్ కాల్స్ లిస్ట్ అందరివీ కాలని అడిగారు. నలుగురు ఎమ్మెల్యేల ఫోన్ కాల్ లిస్ట్.. సీఎం ల్యాండ్ ఫోన్ కాల్ లిస్ట్ కూడా కావాలని అడిగారు. కొత్త కొత్త ఆడియో.. వీడియో తయారు చేస్తున్నారట అని బండి సంజయ్ ఫైరయ్యారు. నిజానికి కేసీఆర్ చెప్పింది వేరు.. అక్కడ జరిగింది వేరు అని బండి సంజయ్ మండిపడ్డారు.