• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అమావాస్య "చంద్రుడు".. సెంటిమెంట్ వర్కవుట్.. కొత్త ప్రభుత్వం ఎప్పుడు?

|

హైదరాబాద్ : శుభాలకు అమావాస్య మంచి రోజు కాదని చాలామంది విశ్వసిస్తారు. ఆ రోజు ముఖ్యమైన పనుల్ని వదిలేస్తారు. అంతలా అమావాస్యపై జనాలకు అపనమ్మకముంటే.. గులాబీ చంద్రుడికి మాత్రం కలిసొచ్చింది. తెలంగాణ ఎన్నికలు జరిగిన రోజు అమావాస్య కావడంతో చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. జ్యోతిషం, వాస్తుశాస్త్రాలను బలంగా నమ్మే కేసీఆర్ కు అమావాస్య రూపంలో ముప్పు పొంచి ఉందని అభిప్రాయపడ్డారు. అయితే అవన్నీ నిజం కాదని నిరూపిస్తూ మరోసారి జయకేతనం ఎగురవేశారు.

టీఆర్ఎస్ భారీ విజయం, గులాబీ సంబరాలు (ఫోటోలు)

ఎన్నికల సందర్భంలో సిద్ధిపేట సమీపంలోని కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి కేసీఆర్ వెళుతుండటం ఆనవాయితీ. అదేక్రమంలో ఈ ఎన్నికల్లో సైతం అదే ఫాలో అయ్యారు. పార్టీ అభ్యర్థులకు ఇచ్చే బీ-ఫామ్స్ స్వామి వారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాదు ఆయన నామినేషన్ దాఖలు చేసేటప్పుడు కూడా అక్కడి వెంకన్నను దర్శించుకున్నారు.

అమావాస్యను గెలిచిన చంద్రుడు.. కేసీఆర్ ఫార్ములా సక్సెస్..!

అమావాస్యను గెలిచిన చంద్రుడు.. కేసీఆర్ ఫార్ములా సక్సెస్..!

ముందస్తు ఎన్నికలకు ముహుర్తం చూసుకున్న కేసీఆర్.. సెప్టెంబర్ 6వ తేదీన అసెంబ్లీ రద్దు చేశారు. ఆరో నెంబర్ తనకు కలిసొస్తుందని ఆయన నమ్మకం. అయితే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకటించడంతో పోలింగ్ తేదీ చూసి చాలామంది కంగుతిన్నారు. ఆరోజు అమావాస్య అంటూ, కేసీఆర్ కు కలిసిరాదంటూ చాలా కథలు వార్చి వండేశారు. ఇక కేసీఆర్ పని అయిపోయిందంటూ లేనిపోని కూతలు కూశారు. అవన్నీ కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. గులాబీ చంద్రుడికి అమావాస్య ఏమాత్రం అడ్డంకిగా మారలేదు. పైగా బంపర్ మెజార్టీ తెచ్చిపెట్టింది.

కొత్త ప్రభుత్వానికి ముహుర్తమెప్పుడో?

కొత్త ప్రభుత్వానికి ముహుర్తమెప్పుడో?

జ్యోతిషం, వాస్తు శాస్త్రాలను బలంగా విశ్వసించే కేసీఆర్ తాను ఏ పని తలపెట్టినా.. తొలుత పండితులను సంప్రదిస్తారు. ముహుర్తబలాలు ఏవిధంగా సరిపోలుతాయో చూసుకుంటారు. 3-4 ముహుర్తాలు చూసుకుని అందులో బలమైనరోజుకి మొగ్గుచూపుతారు. ఇప్పటివరకు ఇదే ఫాలో అయిన కేసీఆర్ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఏ రోజును ఎంచుకుంటారో అన్నది చర్చానీయాంశంగా మారింది. ఒకవేళ 6 కలిసివచ్చేలా చూసుకుంటే ఈనెల 15వ తేదీని ఖరారు చేస్తారేమో. మూఢంతో పాటు మంచిరోజులు లేవనుకుంటే 12వ తేదీనే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశముంది.

కోనాయిపల్లి వెంకన్న కరుణ.. మరోసారి పగ్గాలు

కోనాయిపల్లి వెంకన్న కరుణ.. మరోసారి పగ్గాలు

పొలిటికల్ లైఫ్ లో సిద్దిపేట సమీపంలోని కోనాయిపల్లి వెంకన్న మహిమను బాగా నమ్ముతారు కేసీఆర్. ఆయన కరీంనగర్, మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీచేసిన సందర్భంలోనూ, ఉద్యమ సమయంలో భారీ బహిరంగ సభలు పెట్టినప్పుడు గానీ ఈ స్వామి వారి ఆశీస్సులే తీసుకున్నారు. కోనాయిపల్లి వెంకన్నను దర్శించుకున్న తర్వాత కేసీఆర్ తలపెట్టిన ఏ కార్యక్రమమైనా విజయవంతమైంది. అదేక్రమంలో ఈసారి కూడా ఆ స్వామివారినే కేసీఆర్ నమ్ముకోవడంతో టీఆర్ఎస్ కు బంపర్ మెజారిటీ లభించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Many suspicions have been made since the Telangana election day followed by amavasya. Many People argued that TRS has a threat from amavasya in elections while KCR believes that Jyothish and vastu. But once again proved with trs victory that they are not true.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more