15 వేల కోట్ల పెట్టుబడి.. మైక్రోసాప్ట్ డేటా సెంటర్..
విశ్వనగరి భాగ్యనగరిలో ఐటీ పెట్టుబడులు మరింత పెరిగాయి. కరోనా తగ్గడంతో కంపెనీలు విస్తరిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ 15 వేల కోట్లతో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. పుణె, ముంబై, చెన్నై నగరాల్లో ఉన్న డేటా సెంటర్లకు అదనంగా ఈ కొత్త కేంద్రం సేవల్ని అందించనుంది. క్లౌడ్, ఏఐ ఆధారిత డిజిటల్ ఎకానమీ కస్టమర్లకు సాయం చేసేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యూహాత్మకంగా డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.
మైక్రోసాఫ్ట్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న క్లౌడ్, డేటా సొల్యూషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రొడెక్టివిటీ టూల్స్, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్‌లో సర్వీసులు ఇవ్వనుంది. వ్యాపార సంస్థలకు, స్టార్టప్స్, డెవలపర్స్, ఎడ్యుకేషన్, గవర్నమెంట్ సంస్థలకు ఈ సేవలు అందనున్నాయి. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల వల్ల ఇండియాలో కొత్తగా 15 లక్షల ఉద్యోగాలు వచ్చాయని స్టడీ ద్వారా తేలింది. దీనికి తోడు 169000 కొత్త ఐటీ జాబ్స్‌ను ఇచ్చారు.

ప్రజలు, వ్యాపారుల పట్ల ఉన్న నిబద్ధత వల్ల ప్రపంచంలో ఇండియా డిజిటల్ లీడర్‌గా ఎదుగుతోందని కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్‌తో డిజిటల్ ఎకానమీలో పోటీతత్వం పెరుగుతుందన్నారు. దీని ద్వారా పెట్టుబడులు పెరగనున్నాయి. అన్ని పరిశ్రమలు, రంగాల్లో క్లౌడ్ కీలకంగా మారుతోందన్నారు. హైదరాబాద్‌ను డేటాసెంటర్‌గా ఎంపిక చేసిన మైక్రోసాఫ్ట్ కంపెనీ నిర్ణయం పట్ల తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.
Happy to announce that Hyderabad will be the destination for @Microsoft largest Data Center investment in India with an investment of over ₹15,000 crores#HappeningHyderabad#TriumphantTelangana
— KTR (@KTRTRS) March 7, 2022
An iconic moment in the development story of Telangana! pic.twitter.com/6XC8t386zY
రాష్ట్రానికి రానున్న అతిపెద్ద ఎఫ్‌డీఐ అవుతుందని కేటీఆర్ అన్నారు. మైక్రోసాఫ్ట్, తెలంగాణకు సుదీర్ఘ చరిత్ర ఉందని, హైదరాబాద్‌లో అత్యంత పెద్ద డేటా సెంటర్‌ను ఆ కంపెనీ ఓపెన్ చేయడం సంతోషకరమని అన్నారు. తెలంగాణ-మైక్రోసాఫ్ట్ మధ్య రిలేషన్ పెరగడం ఆనందంగా ఉందన్నారు. డేటా సెంటర్ వల్ల స్థానిక కంపెనీలకు క్లౌడ్ సర్వీసులు పెరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సపోర్ట్‌ను మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత మహేశ్వరి ప్రశంసించారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications