హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కౌరవుల పక్షాన చేరిన కర్ణుడు రాజగోపాల్ రెడ్డి: జీవన్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మహాభారతంలో కర్ణుడిలా పాండవులను వీడి కౌరవుల పంచన చేరుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఆయన ఓటమి ఖాయం అని.. ఇక ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టటం అనేది జరుగదని కామెంట్ చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత సీఎల్పీ అత్యవసరంగా సమావేశమైంది. మునుగోడు ఎన్నికల్లో గెలుపుపై జీవన్ రెడ్డి మాట్లాడారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలిస్తే ఇమేజ్ పెరుగుతుందని.. కాంగ్రెస్ గెలిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కాంగ్రెసే అని అన్నారు.

పార్టీ వీడటం ఎందుకు..?

పార్టీ వీడటం ఎందుకు..?


పార్టీ వీడి పోరాటం చేయాలా? పార్టీలో ఉండి పోరాటం చేస్తే ఎవరు కాదంటారు? ఎవరు వద్దంటారు? కాంగ్రెస్ పార్టీ వద్దందా? అని జీవన్ రెడ్డి.. రాజగోపాల్ రెడ్డిని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి చెప్పే కారణాలు సరైనవి కాదని.. పోరాడే అవకాశాలు ఎన్ని వచ్చినా రాజగోపాల్ రెడ్డి వినియోగించుకోలేదని వివరించారు. పోరాడటానికే రాజీనామా చేస్తున్నానని చెప్పటంలో అర్థం లేదని కొట్టిపారేశారు.

 వినని రాజగోపాల్

వినని రాజగోపాల్


సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎంత చెప్పినా రాజగోపాల్ వినలేదని ఆవేదన వ్యక్తంచేవారు. కాంగ్రెస్ లో ‘పంచ పాండవులు' మాత్రమే మిగిలారని తెలిపారు. పంచ పాండవుల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధర్మరాజులాంటివారని అన్నారు. జగ్గారెడ్డి భీముడు, శ్రీధర్ బాబు అర్జనుడు అంటూ చెప్పుకొచ్చారు. మరి నకులుడు..సహదేవుడు ఎవరో మాత్రం చెప్పలేదు.

Recommended Video

ఆజాదీ సాయంతో మోడీ జమిలి ప్లాన్ *National | Telugu OneIndia
మునిగే నావ

మునిగే నావ


టీఆర్ఎస్ మునిగిపోయే పడవ అని జీవన్ రెడ్డి అన్నారు. రాజగోపాల్ రెడ్డి కన్విన్స్‌గా రాజీనామా చేయలేదని చెప్పారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తానని రాజగోపాల్ అనడంపై జీవన్ రెడ్డి మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి అలా అనడం చేతగాని తనమేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోరాడే అవకాశం ఇచ్చినా రాజగోపాల్ రెడ్డి ఉపయోగించుకోలేదని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. మూడేళ్లలో రాజగోపాల్ రెడ్డి ప్రజల కోసం చేసిన ఉద్యమం ఏమన్నా ఉందా? అని ప్రశ్నించారు. హుజురాబాద్ ఉప ఎన్నికకు మునుగోడుకు రానున్న ఉప ఎన్నికకు సంబంధమే లేదన్నారు.

English summary
mlc jeevan reddy slams raja gopal reddy on party change issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X