సినీనటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత..
సినీనటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతున్నారు. అనారోగ్యంతో సోమాజిగూడ యశోధ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాసేపటి క్రితం ఆయన చనిపోయారని వైద్యులు తెలిపారు. నర్సింగ్ యాదవ్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత
నర్సింగ్ 1968 జనవరి 26న హైదరాబాద్‌లో జన్మించారు. నర్సింగ్ యాదవ్ తెలుగుతోపాటు తమిళ సినిమాల్లో కూడా నటించారు. దాదాపు 300పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. విలన్ పాత్రలు వేసినా.. కామెడీగా చేసిన పాత్రలతో మంచి పేరు సంపాదించారు. తాను చేసిన ప్రతీ పాత్రలో ఆయన జీవించారు. కామెడీ చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.
