హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డిపై హైకోర్టులో పిల్, విచారణ, రిపోర్టర్ బెదిరింపు కేసు

|
Google Oneindia TeluguNews

జర్నలిస్ట్‌ సంతోష్ నాయక్‌ను బెదిరించిన కేసులో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిపై హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. మహిపాల్ రెడ్డి అరెస్ట్‌కు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో మహిపాల్‌రెడ్డిపై అట్రాసిటి కేసు కూడా నమోదైంది. మహిపాల్‌రెడ్డిని అరెస్టు చేయాలని రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. కేసును న్యాయస్థానం శుక్రవారం విచారించనుంది.

జర్నలిస్ట్ సంతోష్ నాయక్‌ను ఫోన్‌లో దూషించినట్టు మహిపాల్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పైల్ చేశారు. జర్నలిస్ట్ సంతోష్‌నాయక్‌ను ఫోన్‌లో దూషించిన ఆడియో క్లిప్పింగ్‌ సోషల్‌ మీడియాలో వైరలైన సంగతి తెలిసిందే. అమీన్‌పూర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు అందడంతో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై ఐపీసీ 109, 448, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

pill on mla gudem mahipal reddy

Recommended Video

Osmania University క్యాంపస్‌లో తెలంగాణ విద్యార్థి ఫెడరేషన్ నేత సురేష్ యాదవ్ పై దాడి | Hyderabad

అంతకుముందు విలేఖరి సంతోష్ నాయక్‌పై ప్రతాపం చూపించిన పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వెనక్కి తగ్గారు. తాను చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నానని స్పష్టంచేశారు. తనకు జర్నలిస్టులంటే గౌరవం ఉందని స్పష్టంచేశారు. అయితే కబ్జాలతో తనకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. తన పేరు రాయడంతో మాట్లడానని.. వివరణ తీసుకొని ఉంటే బాగుండేది అని చెప్పారు. అయినా కేసులు, పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో శుక్రవారం కోర్టు ఏం చెబుతుందోననే ఆసక్తి నెలకొంది.

English summary
pill on mla gudem mahipal reddy for journalist santosh naik threatening issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X