హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజాసింగ్‌కు సర్జరీ, నుదురుపై గడ్డ, వారం రోజులు విశ్రాంతి

|
Google Oneindia TeluguNews

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు సర్జరీ జరిగింది. నుదుటిపై ఉన్న గడ్డ పెద్దగా కావడంతో సర్జరీ చేయించుకున్నారు. ఆ ఆపరేషన్‌ను లిపోమా అని అంటారట. ఈ మేరకు ఆయన ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వారం రోజుల విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారని తెలిపారు. వారం తర్వాత నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటోను రాజాసింగ్ షేర్ చేశారు.

ఇటీవల మహ్మద్ ప్రవక్తపై రాజా సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అదీ పెద్ద దుమారం రేపింది. పోలీసులు పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించారు. దీనిపై రాజాసింగ్ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఆయనకు ఊరట కలిగింది. పీడీ యాక్ట్ రద్దు చేసింది. జైలు నుంచి విడుదల చేసేందుకు అంగీకరించింది. కానీ షరతులు విధించింది.

 Raja singh has hosptilised

శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలా ఎలాంటి చర్యలకు పాల్పడొద్దని పేర్కొంది. సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించేలా పోస్టులు చేయొద్దని స్పష్టంచేంది. జైలు నుంచి విడుదల అయ్యే సమయంలో సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని కూడా స్పష్టంచేసింది. ఆ తర్వాత ఆయన కూడా కాస్త రిలాక్స్‌డ్ గానే ఉన్నారు. ఇప్పుడు గడ్డ ఉండటంతో సర్జరీ చేయించుకున్నారు. ఓ వారం రోజులు అందుబాటులో ఉండనని నియోజకవర్గ ప్రజలకు తెలిపారు.

రాజా సింగ్, ఫైర్ బ్రాండ్. పాతబస్తీలో హిందుత్వని వినిపించే నేత. స్వస్ధలం మహారాష్ట్ర అయినా.. ఇక్కడి ప్రజలతో కలిసిపోయారు. హిందువులను ఏమైనా అంటే ఊరుకోరు. అందుకోసమే మహ్మద్ ప్రవక్తపై ఓ వీడియో తీసి షేర్ చేశారు. దానిని ముస్లింలు చూసి.. ఆందోళనకు దిగారు. దీంతో అరెస్ట్ కూడా జరిగింది. బీజేపీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

English summary
mla Raja singh has hosptilised. he is rest in weekdays at hospital
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X