హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖాకీ కీచకం.. మహిళపై రేప్, భర్తను గన్‌తో బెదిరించి.. సీఐ నాగేశ్వరరావు సస్పెన్షన్

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అంటున్నారు.. కానీ ఓ సీఐ మహిళపై లైంగికదాడి చేశాడు. సమస్యను చెప్పిన భర్తను.. కూలీగా మార్చి.. అతని భార్యను చెరబట్టాడు. మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావు చీకటి బాగోతం ఒకటి వెలుగుచూసింది. కేసుపై ఉన్నతాధికారులు కూడా అంతే వేగంగా స్పందించారు. అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు. సదరు నాగేశ్వర రావు ఇదివరకు బంజారాహిల్స్ డ్రగ్ కేసులో కీలక వ్యవహరించడం విశేషం. ఇప్పుడు కిడ్నాప్, అత్యాచారం, ఆయుధాల కేసులో ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయ్యారు.

న్యాయం చేయాలని హస్తినాపురానికి చెందిన వ్యక్తి పోలీస్ స్టేషన్ వచ్చాడు. అతని భార్యపై నాగేశ్వరరావు లైంగికదాడి చేశాడు. 2018లో ఓ కేసులో బాధిత వ్యక్తిని నాగేశ్వరరావు రిమాండ్ చేశాడు. ఇంటికి కూడా వెళ్లొద్దని, తన పొలం వద్దే పని చేయాలని కండీషన్స్ పెట్టాడని బాధితుడు ఆరోపించాడు. అంతేకాదు తాను లేని సమయంలో తన భార్యను బలవంతంగా పొలం వద్దకి తీసుకెళ్లడంతో గొడవ పడ్డానని చెప్పాడు.

 Rape charges against Marredpally Inspector, suspended

ఈ నెల 7వ తేదీన రాత్రి 12 గంటలకు సీఐ నాగేశ్వరరావు రేప్ చేసినట్టు సమాచారం. అడ్డొచ్చిన ఆమె భర్తను గన్‌తో బెదిరించాడట. ఆ దంపతులను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. ఇబ్రహీంపట్నం చెరువుకట్ట వద్ద కారు యాక్సిడెంట్ కావడంతో బాధితులు తప్పించుకున్నారు. వారు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారుకి ప్రమాదం జరగకుండా ఉంటే తమను సీఐ చంపేసేవాడని బాధితులు నిట్టూరుస్తున్నారు.

నాగేశ్వరరావు గతంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహించారు. పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో కీలకంగా వ్యవహరించాడు. అక్కడి నుంచి మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. కానీ ఇంతలోనే కీలక ఆరోపణలు రావడం.. సస్పెండ్ కావడం చకచకా జరిగిపోయాయి.

English summary
case of rape, criminal trespass, attempt to murder and kidnap under the Indian Penal Code and also under the Arms Act was booked against Marredpally inspector K.Nageshwar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X