ఎంఆర్ఐలో కొంచెం ప్రాబ్లమ్.. ఎడమ చేయి నొప్పి ఇందుకే, యశోద నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
సీఎం కేసీఆర్‌కు వారం రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఉదయం 8 గంటల సమయంలో ఫోన్ వచ్చిందని.. ఎడమ చేయి కొద్దిగా లాగుతోందని కేసీఆర్ తెలిపారు అని ప్రముఖ యశోదా డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. ఆస్పత్రికి వచ్చాక.. ఇతర వైద్యులతో కలిసి పరీక్షలు చేయించామని చెప్పారు. ప్రతి సంవత్సరం పరీక్షలు చేయడం జరుగుతోందని.. అందుకే యశోదా ఆసుపత్రికి రావాలని సూచించామన్నారు. కేసీఆర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత యశోదా ఆసుపత్రి వైద్యులు మీడియాతో మాట్లాడారు.
Recommended Video

ఎంఆర్ఐలో కొద్దీగా ప్రాబ్లమ్.. కానీ
ఎంఆర్ఐ స్కాన్‌లో కొద్దిగా సమస్య ఉందని, వయస్సుతోపాటు ఎక్కువగా వార్తా పత్రికలు, ఐప్యాడ్ వాడుతుండడం వల్ల లెఫ్ట్ ఆర్మ్ నొప్పి వచ్చిందని న్యూరోపిస్టులు నిర్ధారించారని డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. స్పాండిలైసిస్ ప్రాబ్లమ్స్ కొద్దిగా ఉందని.. షుగర్, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉన్నాయన్నారు. కేసీఆర్ గుండె నాళాల్లో ఎలాంటి బ్లాక్స్ లేవన్నారు. 90 శాతం వరకు రిపోర్టులు వచ్చాయని, అన్నీ బాగానే ఉన్నాయన్నారు. ఇటీవల టూర్లు, స్పీచ్ ఇస్తుండడంతో నీరసంగా ఉన్నారని, వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు .ప్రతి వారానికొకసారి రక్త పరీక్ష, గ్లూకోజ్ స్థాయి ఎలా ఉందో చూస్తామన్నారు.

ఆందోళన..
కేసీఆర్ అస్వస్థతకు గురవ్వడంతో అభిమానులు, కుటుంసభ్యులు టెన్షన్‌కు గురయ్యారు. యశోదా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేశారు. యాంజియోగ్రామ్ టెస్టులు చేయగా..నార్మల్ అని తేలింది. అనంతరం ఎంఆర్ఐ, సిటీ స్కాన్, రక్తం, ఇతర పరీక్షలు చేశారు. రిపోర్టుల్లో అన్నీ నార్మల్‌గా వచ్చాయని, ప్రాబ్లమ్ ఏమీ లేదని వైద్యులు వెల్లడించారు. దీంతో ఊపిరిపీల్చుకున్నారు. వైద్య పరీక్షల తర్వాత 9వ ఫ్లోర్‌లో ఉన్న రూమ్‌లో విశ్రాంతి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లారు. వైద్యుల సూచనల మేరకు సీఎం కేసీఆర్ కొద్ది రోజులు విశ్రాంతి తీసుకొనే అవకాశం ఉంది.

కోమటిరెడ్డి రియాక్షన్
కేసీఆర్ ఆసుపత్రిలో చేరారనే వార్తలు విన్న వెంటనే సర్వత్రా ఆందోళన వ్యక్తమయింది. త్వరగా కోలుకోవాలని రాజకీయపార్టీలకు అతీతంగా అందరూ ఆకాంక్షించారు.కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అంతకుముందు బండి సంజయ్ కూడా ఇలాగే స్పందించారు. అమ్మ వారి దయతో కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని వివరించారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications