హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇక తిరుగు పయనం: రిటర్న్ బస్సులు కూడా.. ప్యాసెంజర్ సేవలో టీఎస్ ఆర్టీసీ

|
Google Oneindia TeluguNews

సంక్రాంతి పండగ ముగిసింది. సెలబ్రేషన్ మూడ్ అయిపోయింది. ఇక తిరుగుపయనం చేయాల్సిందే. అవును పల్లె నుంచి పట్టణం రావాల్సిందే. అందుకు టీఎస్ ఆర్టీసీ సేవలను అందిస్తోంది. హైదరాబాద్‌లో నివసించే వారిలో చాలా మంది సంక్రాంతి పండగకు తమ సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. సంక్రాంతి పండగా పూర్తికావడంతో సొంత ఊళ్లకు వెళ్లిన ప్రయాణికులు తిరిగి హైదరాబాద్‌కు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

ఇవాళ్టి నుంచి మళ్లీ హైదరాబాద్ తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం ఆర్టీసీ, రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే శాఖ 110 రైళ్లను ఏర్పాటు చేసింది. తెలంగాణ ఆర్టీసీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. సొంత ఊళ్లకు వెళ్లిన వారి కోసం 3,500 ప్రత్యేక బస్సులు నడపనుంది. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

 ts rtc buses availabl to return journey

హైదాబాద్ లో నివసిస్తున్న ఆయా గ్రామాలకు చెందిన వారు సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లేందుకు కూడా ఆర్టీసీ పత్యేక బస్సులను కేటాయించింది. సంక్రాంతి పండగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ 4940 ప్రత్యేక బస్సులు నడిపిన సంగతి తెలిసిందే. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులతో సేవలు అందజేసింది.

అంతకుముందు మీ ఇంటి వద్దకే బస్సు సర్వీస్ అందజేసింది. ఫోన్ చేస్తే ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు వచ్చింది. ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవడానికి ప్రయాణికులు కోరిన చోట బస్సును ఆపి ఎక్కించుకోవడం, దించడం చేసిన ఆర్టీసీ మరో అడుగు ముందుకు వేసింది. సంక్రాంతికి ఊరు వెళ్లే ప్రయాణికులు ఒకే ప్రాంతంలో 30 మంది ఉంటే.. వారి ప్రాంతం, వారి కాలనీకి బస్సును పంపిస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. అలా సర్వీస్ కూడా ఇచ్చారు. ఇప్పుడు వారిని తిరిగి భాగ్యనగరం తీసుకొచ్చేందుకు సర్వీసులను నడిపిస్తున్నారు. ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా స్పెషల్ బస్సులకు కూడా అదనపు చార్జీలను వసూల్ చేయడం లేదు.

English summary
tsrtc buses available to return journey after complete festive mood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X