హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజ్‌భవన్‌లో ఉగాది సెలబ్రేషన్స్.. కేసీఆర్ ఫోటో మిస్సింగ్, డుమ్మా.. అపశృతి

|
Google Oneindia TeluguNews

ఉగాది పర్వదినం పురస్కరించుకొని రాజ్ భవన్‌లో ఉగాది వేడుకలు జరిగాయి. వేడుకలకు సీఎం కేసీఆర్ కాదు.. మంత్రులు కూడా హాజరు కాలేదు. సీఎం కేసీఆర్ కు గవర్నర్ తమిళి సై ఆహ్వానం పంపారు. అయినా.. ఆయన హాజరు కాలేదు. మరోవైపు ఉత్సవాల ఫ్లెక్సీలపై రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ ఫొటోలు మాత్రమే ఉన్నాయి. ఫ్లెక్సీపై సీఎం కేసీఆర్ ఫొటో కనిపించకపోవడం చర్చకు దారితీసింది. శుభకృత్ నామ సంవత్సరం ముందస్తు ఉగాది వేడుకలను సాయంత్రం నిర్వహించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల జయ్ పాల్ యాదవ్ మాత్రమే పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇతరులు హాజరయ్యారు.

 దూరం.. దూరం...

దూరం.. దూరం...


సీఎం- గవర్నర్ మధ్య దూరం పెరుగుతోందా ? అనే టాక్ వినిపిస్తోంది. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో పాడి కౌశిక్ రెడ్డి చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు ఎమ్మెల్సీ పదవీని కట్టబెట్టాలని టీఆర్ఎస్ భావించింది. దీనికి సంబంధించిన ఫైల్‌ను రాజ్ భవన్ కు పంపింది. ఈ విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్ భవన్‌లో జరిగిన వేడుకలకు కూడా సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు దూరంగా ఉన్నారు.

 నో ఇన్వైట్

నో ఇన్వైట్


ప్రభుత్వం ప్రసంగ పాఠం పంపించాల్సి ఉండగా.. అలాంటిది కూడా జరగలేదు. మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. యాదాద్రి ఆలయ పున:ప్రారంభానికి కూడా గవర్నర్‌ను ఆహ్వానించలేదు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల క్రమంలో ప్రభుత్వానికి, రాజ్ భవన్ మధ్య విబేధాలు మరింత ఎక్కువయ్యాయి.

 అపశృతి

అపశృతి


ఇటు రాజ్ భవన్ లో అపశృతి జరిగింది. ఉగాది వేడుకలు జరుగుతున్న క్రమంలో స్టేజీ కింద ప్రముఖుల దగ్గర గవర్నర్ కూర్చొనే కుర్చీ పక్కకు ఒరిగిపోయింది. దీంతో గవర్నర్ తమిళిసై కింద పడిపోయారు. వెంటనే అక్కడున్న సెక్యూరిటీ అలర్ట్ అయ్యారు. తేరుకున్న గవర్నర్ అదే కుర్చీలో కూర్చొన్నారు. వ్యక్తిగత సిబ్బందిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
ugadi celebrations at rajbhavan. cm kcr and ministers are not attend the programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X