కేంద్రం గుడ్‌ న్యూస్‌- జూన్‌ చివరి కల్లా 15-20 వేల కేసులే- వ్యాక్సిన్‌ వేయకపోతే ధర్డ్‌వేవ్‌

కరోనా సెకండ్‌ వేవ్ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్ని పట్టి కుదిపేస్తున్న వేళ కేంద్రం నియమించిన నిపుణుల ప్యానెల్‌ ఇవాళ ఓ గుడ్‌న్యూస్‌ చెప్పింది. దేశంలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య జూన్‌ చివరి నాటికి భారీగా తగ్గే అవకాశముందని ప్యానెల్‌ సభ్యుడొకరు వెల్లడించారు. అయితే వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా కరోనా కేసుల రోజువారీ సంఖ్య క్రమంగా తగ్గుతోందని తాజా నివేదికలు చెప్తున్నాయి. ఇదే క్రమంలో జూన్‌ చివరి నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 15 వేల నుంచి 25 వేలకు తగ్గిపోనున్నట్లు కేంద్రం నియమించిన నిపుణుల ప్యానెల్ సభ్యుడు హైదరాబాద్‌ ఐఐటీకి చెందిన డాక్టర్‌ ఎం. విద్యాసాగర్‌ వెల్లడించారు. గణిత సూత్రాల ఆధారంగా కేసుల సంఖ్యను గణించినప్పుడు ఈ సంఖ్య తేలినట్లు కేంద్రం నియమించిన ముగ్గురు సభ్యుల శాస్త్రసాంకేతిక ప్యానెల్ సభ్యుడైన విద్యాసాగర్‌ తెలిపారు.

15,000-25,000 Covid Cases A Day By June-End: Government Panel Member

కరోనా సెకండ్‌ వేవ్‌ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం అంతకంటే ఎక్కువగా కనిపిస్తోందని డాక్టర్ విద్యాసాగర్‌ అన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంలో విఫలమైతే మాత్రం ఆరు నుంచి 8 నెలల్లో కరోనా మూడో దశ తప్పదని ఆయన హెచ్చరించారు. వ్యాక్సినేషన్‌ సక్రమంగా సాగకపోవడం వల్ల ఫస్ట్‌ వేవ్‌ తర్వాత పెరిగిన రోగ నిరోధక శక్తి క్షీణించే ప్రమాదముందని విద్యాసాగర్‌ తెలిపారు. రోగ నిరోధక శక్తి పెంచుకున్నవారికి అది ఆరునుంచి 8నెలల తర్వాత క్షీణించే ప్రమాదముందని తాజా పరిశోదనల్లో తేలినట్లు ఆయన వెల్లడించారు. కరోనా తొలి దశతో పోలిస్తే రెండో దశలో 30 శాతం ఎక్కువ మందికి వైరస్ సోకడం వెనుక కారణమిదేనన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+