వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువతిని చూస్తూ హస్త ప్రయోగం.. ఆటో డ్రైవర్ వికృత చేష్ట..

|
Google Oneindia TeluguNews

ముంబై : మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధుల వికృత చేష్టలకు అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. బహిరంగ ప్రదేశాలు, బస్సులు అనే తేడా లేకుండా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ముంబైలో ఇలాంటి ఘటనే జరిగింది. జాగింగ్‌కు వెళ్లిన ఓ యువతిని చూసిన ఆటో డ్రైవర్ ఆమె ఎదుటే హస్త ప్రయోగం చేశారు. దీనిపై సదరు యువతి ఫిర్యాదు చేయడంలో పోలీసులు కేసు నమోదుచేశారు

ముంబై పోవా ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువతి మేనేజ్‌మెంట్ స్టూడెంట్. రోజులాగే ఆదివారం రాత్రి హిరనందానీ ప్రాంతంలో జాగింగ్‌కు వెళ్లింది. అక్కడి చెరువు వరకు వెళ్లి తిరిగొస్తూ బ్యాంకు ఏటీఎం మెట్ల వద్ద కూర్చుని ఫోన్ చూస్తోంది. మధ్యలో తల పైకెత్తి చూడగా.. ఎదురుగా ఓ ఆటోలో కూర్చున్న వ్యక్తి తనవైపు చూస్తున్నట్లు గమనించింది. పరిశీలించి చూడగా... అతను తనను చూస్తూ హస్త ప్రయోగం చేస్తున్నాడని అర్థమైంది.

Recommended Video

షాద్ నగర్ ప్యారడైస్ వద్ద యువతిని ఢీకొట్టిన లారీ
19-year-old woman flashed at by auto driver

బాధితురాలు వెంటనే ట్వీట్ ద్వారా విషయాన్ని పోలీసుల దృష్టికి తెచ్చింది. పోలీసులు అక్కడికి చేరుకునే సరికి ఆటో డ్రైవర్ పారిపోయాడు. బాధిత యువతి నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. ఆటోలో కూర్చున్న వ్యక్తి గడ్డం ఉందని, ఆటో డ్రైవర్‌లు వేసుకునే యూనిఫాంలో ఉన్నాడని, భయం కారణంగా ఆటో నెంబర్ నోట్ చేసుకోలేకపోయానని బాధితురాలు చెప్పింది. తాను 2015 నుంచి ముంబైలో ఉంటున్నా ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి ఎదురవలేదని చెప్పింది. యువతి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, నిందితున్న త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.

English summary
19-year-old woman was flashed at by an auto driver on Saturday while she was jogging in Powai, Mumbai. The woman, a management student, immediately tweeted to Mumbai police, telling them about the incident. The police sent a team to help her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X