వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వావ్.. దేశంలో 70 కోట్ల మందికి వ్యాక్సిన్: మాండవీయ

|
Google Oneindia TeluguNews

కరోనాకు శ్రీరామ రక్ష టీకాయే.. అందుకే తీసుకోవడానికి అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 18ఏళ్లు పైబడిన వారందరికి ప్రభుత్వం టీకాలు ఇస్తోంది. కోవిడ్ వ్యాక్సినేష‌న్‌లో కొత్త మైలురాయిని దేశం చేరుకుంది. భారత్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 70 కోట్ల మంది క‌రోనా టీకాలు తీసుకున్నారని... కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ తెలిపారు.

గ‌త 13 రోజుల్లోనే ప‌ది కోట్ల మందికి కోవిడ్ టీకాలు ఇచ్చిన‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ దిగ్విజయంగా 70 కోట్లకు చేరుకుందంటూ మాండవీయ ట్వీట్‌ చేశారు. ఈ ఘ‌న‌త సాధించినందుకు హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు, ప్ర‌జ‌ల‌కు మంత్రి మాండ‌వీయ అభినందనలు చెప్పారు. తొలి ప‌ది కోట్ల డోసుల‌ను 85 రోజుల్లో, 20 కోట్ల టీకాల‌ను 45 రోజుల్లో, 30 కోట్ల డోసుల‌ను 29 రోజుల్లో, 40 కోట్ల డోసుల‌ను 24 రోజుల్లో, 50 కోట్ల డోసుల‌ు.. 20 రోజుల్లో, 60 కోట్ల డోసుల‌ను 19 రోజుల్లో, ఇక 70 కోట్ల డోసుల‌ను 13 రోజుల్లో ఇచ్చిన‌ట్లు మంత్రి తెలిపారు. 'సబ్‌కో వ్యాక్సిన్ ముఫ్త్ వ్యాక్సిన్' అంటూ మంత్రి ట్యాగ్ చేశారు.

సోమవారం ఒక్కరోజే కోటి మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. మంత్రి తన ట్వీట్‌లో ప్రస్తావించారు. సెప్టెంబర్‌లో సాధించిన రికార్డు ఇదని, ఒక్కరోజే కోటి వ్యాక్సినేషన్ల మార్క్‌ను టచ్ చేశామని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌గా దీనిని అభివర్ణించారు. జనవరి 16న దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ముందుగా హెల్త్ వర్కర్లకు టీకాలు ఇచ్చారు. మార్చి 1న రెండో ఫేజ్ (45 ఏళ్లు నుంచి 60 ఏళ్లు) వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైంది. మూడో ఫేజ్ ఏప్రిల్ 1న మొదలైంది. 18 ఏళ్లు పైబడిన వారందరికి వ్యాక్సినేషన్ ప్రక్రియ మే 1న మొదలైంది. కరోనా వైరస్‌కు చెక్‌ పెట్టాలంటే టీకాతోనే సాధ్యమని.. అందరూ వ్యాక్సిన్‌ తీసుకున్నప్పుడే మనం వైరస్‌ను ఓడించగలమని ఆయన తెలిపారు.

70 crore people get corona vaccine

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.

ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు థర్డ్ వేవ్ అని నిపుణులు చెప్పడంతో భయాందోళన నెలకొంది.

English summary
70 crore people get corona vaccine in the country. health minister said to media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X