విషాదం: ప్రియుడితో వెళ్ళి ప్రాణాలు కోల్పోయింది, ఎందుకంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

కోల్ కతా: పశ్చిమబెంగాల్ లో ప్రియురాలిని ప్రియుడు హత్య చేశాడు.ప్రేమించిన ప్రియుడిని నమ్మి అతడి వెంట వెళ్ళి ప్రాణాలనే కోల్పోయింది.

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ముర్షిబాద్ జిల్లా షేంషేర్ గంజ్ లో ఆదివారం నాడు ఈ ఘటన వెలుగుచూసింది.

ప్రేమించానని చెప్పడంతో నమ్మిన యువతి ఇంట్లో చెప్పకుండా ప్రేమికుడితో వెళ్ళిపోయింది. ఎంత వెతికినా ఆమె ఆచూకీ తెలియలేదు. ఆదివారం రాత్రి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టారు.

murder

అయితే ప్రియుడి వెంట వెళ్ళిన ప్రియురాలు శవమై కన్పించింది. ఘటన స్థలం నుండి నిందితుడు పారిపోయినట్టుగా ప్రత్యక్షసాక్షులు తెలిపారు. అయితే ఆమె గొంతు చుట్టు చేతితో నులిమిన గుర్తులు ఉన్నాయి.

అయితే ప్రియురాలిపై ప్రియుడు అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.మృతదేహన్ని పోస్టుమార్టమ్ కు పంపించినట్టు పోలీసులు చెప్పారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
a lady murdered by lover in west bengal.after rape on his girl friend murdered said police.
Please Wait while comments are loading...