షాక్ అంటే ఇదే: ఆర్ కే నగర్ లో దినకరన్ కు హీరో శరత్ కుమార్ మద్దతు !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ. దినకరన్ కు ఊహించని మద్దతు వచ్చిందని సమాచారం. బహుబాష నటుడు, సమథువా మక్కల్ కట్చి పార్టీ నాయకుడు శరత్ కుమార్ దినకరన్ కు మద్దతు ఇస్తున్నారని సమాచారం.

విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం శరత్ కుమార్ అన్నాడీఎంకే అమ్మ పార్టీ నుంచి పోటీ చేస్తున్న టీటీవీ. దినకరన్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని వెలుగు చూసింది. ఆర్ కే నగర్ నియోజక వర్గంలో శరత్ కుమార్ పార్టీ నాయకులు దినకరన్ కు మద్దతుగా ప్రచారం చెయ్యాలని నిర్ణయించారని తెలిసింది.

Actor Sarathkumar's Samathuva Makkal Katchi will support to AIADMK Amma Party candidate TTV Dinakaran ?

అయితే ఈ విషయంపై శరత్ కుమార్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. శరత్ కుమార్ దినకరన్ కు మద్దతు ఇచ్చే విషయంపై పన్నీర్ సెల్వం వర్గం ఇప్పటి వరకు స్పందించలేదు. శరత్ కుమార్ ప్రచారం చేసినా మాకు ఎలాంటి నష్టం లేదని పన్నీర్ వర్గంలోని ఓ సీనియర్ నాయకుడు అన్నారు.

శశికళ అనుచరులు ఆమె ఫోటో పెట్టుకుని ఆర్ కే నగర్ లో ప్రచారం చెయ్యడానికి వెనకడుగు వేస్తున్నారు. అయితే శరత్ కుమార్ పార్టీ నాయకులు ఏ ధైర్యంతో దినకరన్ కు మద్దతుగా ప్రచారం చెయ్యడానికి సిద్దం అయ్యారో ఆ దేవుడికే తెలియాలి అంటున్నారు ఆర్ కే నగర్ లోని జయలలిత అభిమానులు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
According to the sources said that Actor Sarathkumar's Samathuva Makkal Katchi will support to AIADMK Amma Party candidate TTV Dinakaran.
Please Wait while comments are loading...