సీఎంకు మద్దతు: తమిళనాడు పోలీసు అధికారులు బెదిరిస్తున్నారు: కర్ణాటకలో ఎమ్మెల్యే కేసు !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి మద్దతు ఇవ్వాలని మమ్మల్ని ఆ రాష్టా పోలీసు అధికారులు బెదిరిస్తున్నారని, మాకు రక్షణ కల్పించాలని అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల నాయకుడు తంగ తమిళ్ సెల్వన్ కర్ణాటకలోని మడికేరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

అసెంబ్లీలో పరువు పోకముందే సీఎం పళనిసామి రాజీనామా చెయ్యాలి: తంగ తమిళ్ సెల్వన్ !

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆ రాష్ట్ర పోలీసు అధికారుల మీద ఒత్తిడి తీసుకు వచ్చి మమల్మి వెంటనే తిరిగిరావాలని బెదిరిస్తున్నారని తంగ తమిళ్ సెల్వన్ మడికేరి పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు.

AIADMK rebel-mlas-accuse-tn-cops-forcing-them-support-eps

తాము బస చేసిన రిసార్ట్ దగ్గర మరింత భద్రత కల్పించాలని తంగ తమిళ్ సెల్వన్ మడికేరి జిల్లా పోలీసు అధికారులకు మనవి చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు చేసిన అన్నాడీఎంకే పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు కర్ణాటకలోని కొడుగు (కూర్గ్) సమీపంలోని రిసార్ట్ లో బసచేశారు.

సీఎం పళనిసామిని జైలుకు పంపిస్తా: నా సత్తా చూపిస్తా, మన్నార్ గుడి మాఫియా సవాల్ !

తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన మాకు, మా కుటుంబ సభ్యులకు పోలీసులు ఫోన్ లు చేసి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని, లేదంటే మీ అంతు చూస్తామని బెదిరిస్తున్నారని రెబల్ ఎమ్మెల్యే తంగ తమిళ్ సెల్వన్ ఆరోపిస్తున్నాడు. తంగ తమిళ్ సెల్వన్ ఫిర్యాదు చేశరాని, ఆ విషయంపై దర్యాప్తు జరుగుతోందని మడికేరి పోలీసు అధికారులు అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AIADMK rebel MLAs on Sunday filed a complaint with the Madikeri police against Tamil Nadu police for allegedly stopping them and forcing them to extend their support to Palaniswami government.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X