అన్నాడీఎంకే పార్టీ ఎవరికి: నేడు తుది నిర్ణయం, రెండు వర్గాల్లో ధీమా, ప్రభుత్వానికే చాన్స్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత రెండాకుల చిహ్నం కోసం పోటీ మొదలైన విషయం తెలిసిందే. తమిళనాడు ప్రభుత్వం, శశికళ వర్గంలో రెండాకుల చిహ్నం కోసం గొడవ మొదలు కావడంతో ఎన్నికల కమిషన్ తుది నిర్ణయం తీసుకోవడానికి సిద్దం అయ్యింది.

బుధవారం న్యూఢిల్లీలోని కార్యాలయంలో ఎన్నికల కమిషన్ అధికారులు తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీలోని నాయకుల వాదనలు వింటున్నారు. అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండాకుల చిహ్నం ఎవ్వరికి ఇవ్వాలనే విషయంపై ఎన్నికల కమిషన్ విచారణ చేస్తున్నది.

AIADMK two leaves symbol case EC hear today

తమిళనాడులో అధికారంలో ఉన్న ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గానికే రెండాకుల చిహ్నం కేటాయించాలని ఎన్నికల కమిషన్ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారని తెలిసింది. అయితే ఇరు వర్గాల వాదనలు పూర్తి అయిన తరువాత నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల కమిషన్ అధికారులు నిర్ణయించారని తెలిసింది.

తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గీయులు, టీటీవీ దినకరన్ వర్గీయులు బుధవారం ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ ముందు హాజరై తమ వాదనలు వినిపిస్తున్నారు. ఎలాగైనా రెండాకుల చిహ్నం సంపాధించాలని టీటీవీ దినకరన్ వర్గం ప్రయత్నాలు చేస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AIADMK two-leaf symbol is far from over. What was expected to be the last hearing in the party symbol case before the Election Commission of India has been further extended with the body scheduling the hearing on today.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి