ఎయిర్‌బస్ ఫ్లైట్లల్లో భారీ లోపాలు: అన్నీ వాపస్
ఎయిర్‌బస్ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో.. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానయాన సంస్థలు తమ డజన్ల కొద్దీ A320 విమానాలను నిలిపివేశాయి. తీవ్రమైన సౌర కిరణాల కారణంగా విమానాల ఫ్లైట్-కంట్రోల్ డేటా దెబ్బతినే అవకాశం ఉందని ఎయిర్‌బస్ సంస్థ హెచ్చరించింది. దీనివల్ల సాఫ్ట్వేర్, హార్డ్వేర్లలో మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దేశంలో 200 నుంచి 250 విమానాలకు తక్షణ సాఫ్ట్వేర్ అప్డేట్ లేదా హార్డ్‌వేర్ రీఅలైన్మెంట్ అవసరమని ఎయిర్ బస్ సంస్థ తెలిపింది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా పౌర విమానయాన సంస్థలన్నీ కూడా ఎయిర్ బస్ ఫ్లైట్ సర్వీసులను నిలిపివేశాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వంటి పౌర విమానయాన సంస్థలు పెద్ద ఎత్తున ఈ ఎయిర్ బస్ విమానాలను వినియోగిస్తోన్నాయి. అవన్నీ కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ఆయా విమానాల సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ ను అప్ డేట్ చేసిన తర్వాతే.. వాటిని వినియోగంలోకి తీసుకుని వస్తారు.

ఇటీవల విదేశాల్లో చోటు చేసుకున్న ఓ A320 విమాన ప్రమాదాన్ని ఎయిర్‌బస్ విశ్లేషించింది. ఈ సంఘటనలో ఎలివేటర్ ఐలెరాన్ కంప్యూటర్ (ELAC)లో లోపం కారణంగా విమానం అకస్మాత్తుగా కిందికి పడిపోయింది. యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA) దీనిపై అత్యవసర ఎయిర్‌వర్తినెస్ డైరెక్టివ్‌ను జారీ చేసింది. దీని ప్రకారం, ప్రభావిత విమానం తదుపరి ప్రయాణానికి ముందు ఎలివేటర్ ఐలెరాన్ యూనిట్లను తప్పనిసరిగా అమర్చాలని విమానయాన సంస్థలకు సేఫ్టీ ఏజెన్సీ సూచించింది.
సాధారణంగా ఈ ఎలివేటర్ ఐలెరాన్.. ఫ్లైట్ కంట్రోల్ కోసం ఉపయోగిస్తారు. దేశంలో సుమారు A320 సిరీస్ కు చెందిన 560 విమానాలు ఉన్నాయి. వాటిలో సగానికి పైగా విమానాల్లో ఈ మార్పులు అవసరం కావచ్చని అంచనా. అంటే దాదాపుగా 250 వరకు ఎయిర్ బస్ విమానాలు ఇప్పటికిప్పుడు అందుబాటులోకి ఉండబోవు. ఎయిర్‌బస్ నోటిఫికేషన్ గురించి ఇండిగో సంస్థ వివరణ ఇచ్చింది. తమ సంస్థలో ఎయిర్‌బస్ విమానాలు ఉన్నాయని, అవసరమైన తనిఖీలు నిర్వహిస్తోన్నామని పేర్కొంది.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది. A320 విమానాల సాఫ్ట్వేర్ ఫిక్స్ అవసరమని హెచ్చరిక వచ్చిన వెంటనే తక్షణ జాగ్రత్త చర్యలు తీసుకున్నామని తెలిపింది. తమ విమానాలలో ఎక్కువ భాగం దీనివల్ల ప్రభావితం కావట్లేదని పేర్కొంది. ఈ మార్గదర్శకాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని విమానయాన సంస్థలకు వర్తిస్తాయని వివరించింది. దీనివల్ల విమాన కార్యకలాపాలలో జాప్యం లేదా రద్దు కూడా ఉండకపోవచ్చని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications