• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తిక్క కుదిరింది: ఆ పర్యాటక ప్రాంతంలో ఆల్కాహాల్ బ్యాన్

|

గోవా... భూమిపై ఇదో స్వర్గం అని చాలా మంది అభిప్రాయం. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం... సముద్రంలో ఎగిసిపడుతున్న అలలు, అక్కడి సంస్కృతి అన్నీ చాలా బాగుంటాయి. భారత్‌లో విహారయాత్రకు బెస్ట్ ప్లేస్ ఏది అంటే నోట్లోనుంచి టక్కున వచ్చే సమాధానం గోవా. గోవాలో మద్యం కూడా చాలా తక్కువ ధరకే దొరకడంతో మందుబాబులకు ఫేవరెట్ టూరిజం స్పాట్‌గా గోవానే ముందు వరుసలో ఉంటుంది. అయితే ఇప్పుడు గోవాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే భారీ జరిమానా విధించేందుకు అక్కడి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఏంటి నమ్మలేకున్నారా.. ఇది అక్షర సత్యం.

ఆర్థిక అభివృద్ధి సమాఖ్య కార్యక్రమాన్ని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు భారీగా జరిమానా కూడా విధిస్తున్నట్లు సీఎం చెప్పారు. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. గోవాకు చాలామంది పర్యాటకులు వచ్చి మద్యం తప్పకుండా సేవిస్తారు. మరలాంటప్పుడు సీఎం నిర్ణయం ఒక్కింత విస్మయానికి గురిచేసిందని ఆ రాష్ట్ర ప్రజలు చెబుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపాన నిషేధం వచ్చేనెల 15 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. అంతేకాదు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం, ప్లాస్టిక్ సంచుల వినియోగంపై ఉన్న జరిమానా కూడా పెంచుతున్నట్లు ప్రకటించారు.

Alcohol to be banned in public places in Goa

" పౌరులు బాధ్యత కలిగి ఉండటమే కాదు.. బాధ్యతతో ప్రవర్తించాలి పనాజీ నగరంలోని నది ఒడ్డున ఫుట్ పాత్ నిర్మిస్తే చాలామంది అక్కడ బీర్లు తాగి బాటిళ్లను అక్కడే పడేస్తున్నారు" అని పారికర్ చెప్పారు. అందుకే బహిరంగ ప్రదేశాల్లో మందు కొడితే భారీ జరిమానా విధిస్తామని వెల్లడించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, ప్లాస్టిక్ సంచులు వినియోగించినా ప్రస్తుతం జరిమానా రూ.100గా ఉంది. ఇక దాన్ని రూ.2500కు పెంచుతామని పారికర్ స్పష్టం చేశారు. పారికర్ నిర్ణయంతో ఒక్కసారిగా మందుబాబులకు తాగకుండానే మత్తెక్కినట్లయ్యింది పరిస్థితి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
Goa is known for its relaxing vibe, and not to mention cheaper alcohol. However, from August 15 onwards, tourists will have pay heavy fine for drinking alcohol at public places in Goa.Addressing a gathering after opening the incubation centre at the state-run Economic Development Corporation (EDC),Goa Chief Minister Parrikar said the fine for littering and carrying plastic bags would also go up from the next month.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more