షాక్: 232 బ్యాంకింగ్ యాప్‌ల‌‌పై వైరస్ దాడి, లావాదేవీల్లో జాగ్రత్త

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కొత్త రకం ఆండ్రాయిడ్ మాల్ వేర్ బ్యాంకింగ్ , ఆర్థిక సంస్థలకు చెందిన యాప్‌లపై దాడి చేస్తోంది. సుమారు 232 బ్యాంకింగ్ యాప్‌లపై ఈ మాల్‌వేర్ దాడి చేస్తోందని క్విక్ హీల్ ప్రకటించింది. డిజిటల్ లావాదేవీలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆ సంస్థ హెచ్చరించింది.

పెద్ద నోట్ల రద్దు తరవాత డిజిటల్‌ లావాదేవీలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. అయితే డిజిటల్ లావాదేవీల విషయంలో కొత్త రకం వైరస్ బ్యాంకింగ్ సంస్థలను లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తోందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

శుభవార్త: కనీస నగదు నిల్వ రూ.1000కు తగ్గింపుకు ఎస్‌బిఐ యోచన?

మొబైల్ యాప్స్ ద్వారా నగదు లావాదేవీలు నిర్వహించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.సుమారు 232 బ్యాంకింగ్ సంస్థల యాప్‌లపై కొత్త రకం వైరస్ దాడి చేస్తోందని సైబర్ నిపుణులు ప్రకటించారు.

డిజిటల్ లావాదేవీల సమయంలో జాగ్రత్తలు

డిజిటల్ లావాదేవీల సమయంలో జాగ్రత్తలు

డిజిటల్ లావాదేవీలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఎడాపెడా బ్యాంకింగ్‌ యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేయడం, లాగిన్‌ ఐడి, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయకకూడదని సూచిస్తున్నారు.. అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే ముందూ, సమాచారాన్ని ఎంటర్‌ చేసే ముందుకు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని సూచిస్తున్నారు.

232 బ్యాంకింగ్ యాప్‌లను అనుసరిస్తున్న వైరస్

232 బ్యాంకింగ్ యాప్‌లను అనుసరిస్తున్న వైరస్

కొత్తరకం ఆండ్రాయిడ్‌ మాల్‌వేర్‌ శరవేగంగా బ్యాంకింగ్‌, ఆర్థిక సంస్థలకు సంబంధించిన యాప్‌లను కమ్మేస్తోంది. దాదాపు 232 బ్యాంకింగ్‌ యాప్‌లను ఈ మాల్‌వేర్‌ అనుకరిస్తుంది. ఈ మాల్‌వేర్‌ పేరు ఆండ్రాయిడ్‌.బ్యాంకర్‌.ఎ2ఎఫ్8ఎ. థర్డ్‌పార్టీ స్టోర్లలోని నకిలీ ఫ్లాష్‌ప్లేయర్‌ యాప్‌ ద్వారా ఇది మన మొబైల్‌లోకి ప్రవేశించి విస్తరిస్తోందని క్విక్‌హీల్‌ వెల్లడించింది.

నకిలీ నోటిఫికేషన్లు

నకిలీ నోటిఫికేషన్లు

ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ అయిన తర్వాత ఇన్‌స్టాల్‌ అయిన బ్యాంకింగ్‌, క్రిప్టోకరెన్సీ యాప్‌లను పట్టేస్తుంది. వాస్తవ యాప్‌ల నోటిఫికేషన్లను పోలిన మోసపూరిత నోటిఫికేషన్‌ను ప్రదర్శిస్తుంది. యూజర్లకు సంబంధించిన లాగిన్‌ ఐడి, పాస్‌వర్డ్‌ను అడుగుతుంది.ఐడి పాస్ వర్డ్‌తో లాగిన్ అయితే సమాచారం మొత్తం తస్కరణకు గురికాక తప్పదని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

థర్ట్‌పార్టీ యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోవద్దు

థర్ట్‌పార్టీ యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోవద్దు

థర్డ్‌ పార్టీ యాప్‌ స్టోర్స్‌ నుంచి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయవద్దు. అంటే ఇ-మెయిల్స్‌, ఎస్‌ఎంఎ్‌సలు, లింక్స్‌ ద్వారా వచ్చే మెసేజ్‌ల ఆధారంగా యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు. మన మొబైల్‌లోని అన్‌నోన్‌ సోర్సెస్‌ ఆప్షన్‌ను ఎప్పుడూ డిజేబుల్‌ చేసి ఉంచాలి. యాంటీవైరస్‌ ఉంటే అది మాల్‌వేర్‌ను అడ్డుకోగలదు. స్మార్ట్‌ఫోన్‌లోని ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను, యాప్‌ వెర్షన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌ చేసుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An Android malware is reportedly targeting over 232 banking apps including a few banks in India. The Trojan malware, named 'Android.banker.A9480', is designed to steal personal data from users, Quick Heal Security Labs reports.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి