చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విమానంలో స్మోకింగ్.. స్మెల్ రావడంతో పట్టుకొని,, అరెస్ట్.. ఎవరంటే

|
Google Oneindia TeluguNews

సిగరెట్ స్మోకింగ్ ఇంజ్యురిస్ టు హెల్త్.. పొగ తాగడం అనారోగ్యానికి హానికరం అని నెత్తి నోరు బాదుకుంటున్నారు. అయినా చైన్ స్మోకర్లు వినిపించుకోవడం లేదు. ఏదో గుట్టు చప్పుడు కాకుండా తాగితే ప్రాబ్లమ్ లేదు. కానీ బహిరంగ చోట్ల తాగితేనే ఇబ్బంది. అవును ఓ ప్రయాణికుడు ఆపుకోలేకపోయాడు. విమానంలో సిగరెట్ తాగాడు. సిబ్బంది పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అతనిది ఆంధ్రప్రదేశ్ కావడం విశేషం. ఏపీకి చెందిన వ్యక్తి.. ఇలా చేయడం ఇబ్బంది కరంగా ఉంది.

బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం నేరం. అలా చేస్తే శిక్షార్హం కూడా. బహిరంగ ధూమపానంపై నిబంధనలు ఉన్న భారత్‌లో ఓ వ్యక్తి దాన్ని ఖాతరు చేశాడు. ఏకంగా విమానంలో దర్జాగా సిగరెట్ కాల్చాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తే కావటం గమనించాల్సిన విషయం. కువైట్ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో 137 మంది ప్రయాణికులు ట్రావెల్ చేస్తున్నారు. ఆ విమానంలో ఏపీకి చెందిన 57 ఏళ్ల మహ్మద్ షరీఫ్ ఉన్నాడు. అతడు సెక్యూరిటీ కళ్లు ఎలా కప్పాడో గానీ విమానంలోకి సిగరెట్లు తెచ్చాడు. తెచ్చుకున్నవాడు కుదురుగా ఉండకుండా ఏకంగా విమానంలోనే సిగరెట్ కాల్చాడు.

AP Man Smoking inside flight

సిగరెట్ పొగ వాసన చూసి సిబ్బంది అతని వద్దకు వచ్చారు. వెంటనే అతనిని పట్టుకున్నారు. విమానం దిగిన తర్వాత.. సంబంధిత పోలీసులకు సమాచారం అందజేశారు. అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. సిగరెట్ తాగాడని అభియోగం కింద కేసు నమోదు చేశారు.

వాస్తవానికి సిగరెట్ జోన్లు కూడా ఉంటాయి. హోటల్, రెస్టారెంట్ ఇతర చోట్ల సిగరెట్ తాగేవారికి ప్రత్యేక ప్రదేశం ఉంటుంది. అలాంటి చోట ఇబ్బందులు ఉండవు. బహిరంగ ప్రదేశాల్లో తాగితేనే ప్రాబ్లమ్. దీనికి సంబంధించి బోర్డులు పెట్టిన ఫలితం లేకుండా పోయింది. ఇలా విమానంలో సిగరెట్ వెలిగించి లేని కష్టాన్ని కొనితెచ్చుకున్నాడు. సో మిగతా వారు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే పోలీసులు మీపై కేసులు పెట్టి.. లోపలికి పంపించే ప్రమాదం ఉంది. బాధ్యతాయుతంగా మెలగాలని మేధావులు కోరుతున్నారు.

English summary
Andhra Pradesh Man Smoking inside flight. flight come kuwait to chennai. he smoke cigarette, staff catched
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X