వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబా రాందేవ్‌ కోవిడ్‌ సెంటర్‌ మాయ- పేరుకే ఆస్పత్రి- అంతా గారడీ-న్యూస్‌ లాండ్రీ గ్రౌండ్‌ రిపోర్ట్‌

|
Google Oneindia TeluguNews

కరోనాను తగ్గించేందుకు కరోనిల్‌ పేరుతో మందుకనిపెట్టానంటూ గతంలో జనాన్ని బురిడీ కొట్టించిన యోగా గురు బాబా రాందేవ్‌ ఇప్పుడు హరిద్వార్‌లో కరోనా ఆస్పత్రి విషయంలోనూ జనాన్ని మాయ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ తాజాగా కరోనా రోగుల కోసం ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ సహకారంతో మే 3న ప్రారంభమైన ఆస్పత్రి అంతా మాయేనని తేలింది క్షేత్రస్దాయిలో అక్కడ ఎలాంటి సదుపాయాలు, డాక్టర్లు కానీ, మందులు కానీ లేవని తెలుస్తోంది. న్యూస్‌ లాండ్రీ వెబ్‌సైట్‌ చేపట్టిన గ్రౌండ్‌ రిపోర్ట్‌లో ఇక్కడ ఓ ఆస్పత్రికి ఉండాల్సిన లక్షణాలే లేవని నిర్ధారణ అయింది.

బాబా రాందేవ్‌ మరో మాయ

బాబా రాందేవ్‌ మరో మాయ

గతేడాది కరోనా పీక్‌లో ఉన్న సమయంలో ఈ వైరస్‌కు తాము కనిపెట్టిన కరోనిల్ మందు బాగా పనిచేస్తోందని, ఇక ఇతరత్రా మాత్రలు, మందులు అవసరం లేదని బాబా రాందేవ్‌ తెలిపారు. కానీ ఐసీఎంఆర్‌ అనుమతి లేని కరోనిల్‌పై విమర్శలు రావడంతో పాటు అధికారులు భారీగా జరిమానా కూడా విధించారు. ఆ వివాదం పూర్తిగా ముగియకముందే ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కరోనా బాధితుల కోసమంటూ రాందేవ్‌ ఓ ఆస్పత్రి ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ సహకారంతో పతంజలి ఈ ఆస్పత్రి నడుపుతోంది. ఇప్పుడు ఇందులోనూ కరోనాకు వైద్యం అందడం లేదని తాజాగా న్యూస్‌ లాండ్రీ అనే వెబ్‌సైట్‌ చేసిన పరిశోధనలో వెల్లడైంది.

కరోనా ఆస్పత్రిపై రాందేవ్‌ గొప్పలు

కరోనా ఆస్పత్రిపై రాందేవ్‌ గొప్పలు

కరోనా బాధితుల కోసం ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ సహకారంతో నిర్మించిన ఈ ఆస్పత్రిలో 150 ఆక్సిజన్‌ బెడ్లు ఉన్నాయని, వీటితో పాటు ఐసీయూ, వెంటిలేటర్‌ సదుపాయాలూ ఉన్నట్లు రాందేవ్‌ టీవీల్లో పలుమార్లు ఊదరగొట్టారు. కానీ న్యూస్‌ లాండ్రీ జరిపిన పరిశోధనలో అక్కడ ఉన్న 150 బెడ్లలో 50 మాత్రమే పనికొచ్చేలా ఉన్నాయని బయటపెట్టింది. అంతే కాదు ఐసీయూ బెడ్లు లేనే లేవని తేలింది. అక్కడ నిపుణులైన డాక్టర్లు, సిబ్బంది ఉన్నారని రాందేవ్ చెప్తున్నా.. అసలు డాక్టర్‌లు, ఇతర సిబ్బంది అందుబాటులో లేనట్లు తెలిసింది.

ఇక్కడ కరోనిల్‌తోనే వైద్యం

ఇక్కడ కరోనిల్‌తోనే వైద్యం

గతేడాదితో పోలిస్తే కరోనా వైద్యానికి పలు ఔషధాలు, ఇంజెక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. అయినా ఇప్పటికీ ఈ పతంజలి ఆస్పత్రిలో మాత్రం కరోనిల్‌ మందులే ఇస్తున్నట్లు తెలుస్తోంది. వీటితోనే కరోనా తగ్గుతుందని ఇక్కడికి వచ్చే రోగులను నమ్మబలుకుతున్నారు. దీంతో ఇక్కడికి వచ్చేవారూ కరువయ్యారు. ఈ ఆస్పత్రికి పైకప్పే లేదని, కోవిడ్‌ వ్యాప్తికి పరిస్ధితులు పూర్తి అనుకూలంగా ఉన్నట్లు న్యూస్‌ లాండ్రీ పరిశోధనలో గుర్తించింది. ఇక్కడకు వచ్చే కరోనా రోగులకు ఆయుర్వేదం, అల్లోపతి, యోగాతో కూడిన చికిత్స అందిస్తున్నట్లు చెప్తున్నారు.

ఉత్తరాఖండ్‌ సర్కార్‌ అభాసుపాలు

ఉత్తరాఖండ్‌ సర్కార్‌ అభాసుపాలు


ఆస్పత్రులు నడపటంలో, ఇష్టారీతిన మందుల ఉత్పత్తిలో రాందేవ్‌ ట్రాక్‌ రికార్డు తెలిసినా ఆయనతో జత కట్టిన ఉత్తరాఖండ్‌లోని తీరథ్‌సింగ్‌ రావత్ ప్రభుత్వం ఇప్పుడు విమర్శలపాలవుతోంది. ఆస్పత్రిలో చెప్పిన విధంగా సదుపాయాలు లేనప్పటికీ రాందేవ్ టీవీ ఛానళ్లలో దాన్ని ప్రమోట్‌ చేసుకుంటున్నారు. కానీ అక్కడికి వెళ్తున్న రోగులకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉందన్న కారణంతో ఇక్కడికి వస్తే ఇలా జరుగుతోందని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఐసీయూ బెడ్లు లేకపోవడంతో రోగుల్ని చేర్చుకోవడం లేదని కూడా తెలుస్తోంది.

English summary
Baba Ramdev's haridwar covid facility, a collaboration between Patanjali and Uttarakhand government, doesn't have enough staff and its ICU ward and ventilators aren’t functional.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X