వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్పిడిపై ఆందోళన: బ్యాంకులు ఇలా చేస్తాయి..

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రూ. 500, 1000 నోట్ల మార్పిడికి బ్యాంకులు గురువారం నుంచి అదనపు గంటలు పనిచేసే అవకాశం ఉంది. ఎక్కువ సమయం కూడా పనిచేస్తాయి. చెల్లని ఆ నోట్లను మార్పిడి చేసుకోవడానికి అవసరమైన ఏర్పాట్లను బ్యాంకులు కల్పిస్తున్నాయి. గురువారం నుంచి బ్యాంకులు నోట్ల మార్పిడికి అవకాశం కల్పిస్తాయి.

అంతేకాకుండా, ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని రిజర్వ్ బ్యాంక్‌తో పాటు ప్రభుత్వం ముంబై, దేశరాజధాని ఢిల్లీల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయబోతున్నాయి. సమస్య తలెత్తకుండా ఆ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ ఆ విషయం చెప్పారు.

Banks to open more counters, work extra hours to exchange Rs 500, 1000 notes

చిన్న విలువ గల నోట్లను పోగు చేసుకోవడానికి బ్యాంకులకు బుధవారం సెలవు ప్రకటించారు. గురువారం నుంచి అంటే ఈ నెల 10వ తేదీ నుంచి చెల్లని నోట్లను బ్యాంకులు తీసుకుంటాయి. డిసెంబర్ 30వ తేదీ వకరు ప్రజలు తమ ఖాతాల్లో చెల్లని నోట్లను జమ చేయడానికి అవకాశం ఉంటుంది.

బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో ఏర్పాటు చేసే ప్రత్యేక కౌంటర్లలో రోజుకు రూ. 4000 చొప్పున ఈ నెల 24వ తేదీ వరకు చెల్లని నోట్లను మార్పిడి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.బ్యాంకులు అసాధారణమైన లావాదేవీలను ఆర్థిక నిఘా శాఖకు, పన్నుల అధికార యంత్రాంగానికి స్క్కూటినీ కోసం తెలియజేస్తాయి.

English summary
Banks will open additional counters and work extra hours beginning Thursday to help people exchange Rs 500 and Rs 1000 notes that have been declared invalid from midnight on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X