Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెంగళూరు గ్రాండ్ మేకోవర్: సిలికాన్ సిటీ టు AI సిటీ

ఇండియన్ సిలికాన్ సిటీగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బెంగళూరు.. తన పేరును మరోసారి సార్థకం చేసుకుంది. తన సత్తా చాటుకుంది. 2025లో సంపూర్ణంగా మేకోవర్ అయింది. మార్కెట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కౌంటర్‌ పాయింట్ రీసెర్చ్ ప్రకారం.. ఒక్క ట్రాఫిక్ ఇబ్బందులు మినహాయిస్తే దేశంలో ఇతర నగరాలతో పోల్చుకుంటే బెంగళూరు ది బెస్ట్. 2025 AI సిటీ ఇండెక్స్ కూడా బెంగళూరును నవంబర్ వన్ గా ప్రకటించింది.

బెంగళూరులో అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ ఎకోసిస్టమ్ ద్వారా గణనీయమైన విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే దీనికి కారణమని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గ్లోెబల్ ఆర్ అండ్ డీ, డేటా సెంటర్ హబ్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందీ సిటీ. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి కూడా కీలక ప్రాజెక్టులు రానున్నాయి. జంట సొరంగ నెట్‌వర్క్ ఇందులో భాగం. డబుల్ డెక్కర్ మెట్రో లైన్, ఎలివేటెడ్ కారిడార్, బిజినెస్ కారిడార్, స్కైడెక్ ప్రాజెక్టులకు 2025లోనే బీజం పడింది.

Bengaluru Makeover in 2025 Silicon City Transforms into an AI City

బిడది సమీపంలో 9,000 ఎకరాల్లో ఏఐ సిటీ నిర్మాణ కార్యాచరణ ప్రణాళికకూ ఈ ఏడాదే శ్రీకారం చుట్టారు. దేశంలోనే అతిపెద్ద ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) సిటీ ఇక్కడ రూపుదిద్దుకోనుంది. 'గ్రేటర్ బెంగళూరు ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ (GBIT)' ను బిడదిలో ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టింది. సుమారు 9,000 ఎకరాల్లో ఈ ఏఐ ఆధారిత టౌన్ షిప్ ఏర్పాటు కానుంది. బెంగళూరు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో మైసూరు రోడ్డులో ఉంటుంది బిడది.

నగర పాలనలో వికేంద్రీకరణను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) స్థానంలో కొత్తగా ఏర్పడిన గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA) ఏర్పాటైంది ఈ ఏడాదే. సెంట్రల్ బెంగళూరు కార్పొరేషన్‌ పరిధిలో శివాజీనగర్, శాంతినగర్, పులకేశినగర్, చిక్‌పేట్, గాంధీనగర్, చామరాజపేట్ ప్రాంతాలు ఉండనున్నాయి. నగర శివార్లలో ఉన్న ప్రాంతాలు తూర్పు, పశ్చిమ, ఉత్తర లేదా దక్షిణ బెంగళూరు కార్పొరేషన్‌ల పరిధిలోకి వచ్చాయి.

అలాగే రామనగర జిల్లా బెంగళూరు దక్షిణగా పేరు మార్చుకుంది. టెక్నాలజీ డైలాగ్ సమ్మిట్ సందర్భంగా లక్ష కోట్ల రూపాయలకు పైగా ఎంఓయూలు కుదిరాయి. AI, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో ఈ అవగాహన ఒప్పందాలు కుదిరాయి. స్టార్టప్ ల విషయంలో కూడా బెంగళూరు ప్రధాన కేంద్రంగా కొనసాగుతోంది. నేరాల గుర్తింపు, ట్రాఫిక్ నిర్వహణకు AI వినియోగాన్ని మొదలు పెట్టారు బెంగళూరు సిటీ పోలీసులు.

అదే సమయంలో యశ్వంత్ పూర్ సత్వ నాలెడ్జ్ పాయింట్ లో టీసీఎస్ కు చెందిన అతి పెద్ద ఆఫీస్ స్పేస్ ఏర్పాటు కానుంది. 1.75 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ను ఈ ఏడాదే లీజుకు తీసుకుందా సంస్థ. దీని కాలపరిమితి అయిదు సంవత్సరాలు. దీని మొత్తం అద్దె వ్యయం సుమారు రూ. 975 కోట్లు. ఈ లీజు ప్రకారం- టీసీఎస్ నెలకు రూ. 15.37 కోట్లు అద్దె చెల్లించనుంది. స్కైడెక్ ప్రాజెక్ట్ బెంగళూరుకు ప్రత్యేక ఆకర్షణ. టూరిజం, టెక్నాలజీ, ఇన్నోవేషన్ వంటి ప్రాజెక్టులతో బెంగళూరు దూసుకుపోతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+