వామ్మో.. వీళ్లు విద్యార్థులు కారు, బాబోయ్, ఆన్సర్ షీట్లలో చిత్ర, విచిత్ర వినతులు
విద్యార్ధులు పరీక్షల్లో వచ్చిన క్వశ్చన్లకు ఆన్సర్లు రాస్తారు.. కానీ పిచ్చి పిచ్చి ఆన్సర్లు కూడా ఉంటాయి. కానీ బీహార్‌లో మాత్రం బోర్డు ఎగ్జామ్ రాసిన విద్యార్ధులు పరీక్షల్లో కొన్ని ఆన్సర్లతోపాటు విచిత్రంగా రాశారు. అదీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ వారు ఏం రాశారో తెలుసుకుందాం.. పదండి.

ఫెయిల్ అయితే పెళ్లవదు
సర్..ఫెయిల్ అయితే పెళ్లి అవ్వదు.. పాస్ చేసి పుణ్యం కట్టుకోండి అంటూ విద్యార్ధులు వింతగా విన్నపాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బీహార్‌లో 12th classబోర్డ్ ఎగ్జామ్స్ ఆన్సర్ పేపర్లపై విద్యార్ధులు ఇలా రాశారు. ఎగ్జామ్స్ రాసిన విద్యార్ధులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. పేపర్ కరక్షన్ ప్రక్రియ కూడా పూర్తి అయ్యింది. ఫలితాల కోసం విద్యార్ధులంతా ఎదురు చూస్తున్నారు.

విచిత్ర వినతులు
కొందరు విద్యార్థులు సమాధాన పత్రాలలో పలు విచిత్రమైన వినతులు చేసుకున్నారు. కరోనా వల్ల సరిగా చదువుకోలేక పోయామని..పాస్ అవుతామో లేదో అనే భయంగా ఉందనీ..దయచేసి, తమను పాస్ చేయాలని వేడుకున్నారు. కొంతమంది తాము హనుమంతుని భక్తులమని.. తమను పాస్ చేయాలని కోరారు. ఆన్సర్ షీట్లలో వినతులు రాసుకొచ్చారు.

మే 26వ తేదీన వివాహం
మే 26న నా వివాహం జరగనుంది. ఒక వేళ ఫెయిల్ అయ్యానంటే ఏమవుతుందో తెలియడం లేదు. అందుకే సార్ నన్ను ఫస్ట్ డివిజన్‌లో పాస్ చేయండి అని వేడుకున్నారు. సార్ నాదొ అభ్యర్థన, పరీక్ష బాగా రాయలేకపోయాను. ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఫీవర్ వచ్చింది. సార్ నన్ను మీ కుమార్తెగా భావించి, మంచి మార్కులు వేయండి. మాది చాలా పేద కుటుంబం. నన్ను అర్థం చేసుకోవాలని రాసింది. మరో విద్యార్థి సార్ నన్ను క్షమించండి. నేను చాలా పేదవాడిని. దయచేసి అర్థం చేసుకోండీ..కావాలంటే మీ కాళ్లపై వాలిపోతాను. దయచేసి మంచి మార్కులు వేయండి..అంటూ వేడుకున్నాడు.