వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్హల్‌లో ఎస్పీ రిగ్గింగ్.. రీపోలింగ్ నిర్వహించాల్సిందే : బీజేపీ డిమాండ్

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఆదివారం మూడో విడత పోలింగ్ ముగిసింది. అయితే ఈ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అక్రమాలకు పాల్పడిందని బీజేపీ ఆరోపిస్తోంది. బరితెగించి రిగ్గింగ్ కు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 కర్హల్‌లో రిగ్గింగ్ ఆరోప‌ణ‌లు

కర్హల్‌లో రిగ్గింగ్ ఆరోప‌ణ‌లు

యూపీలోని కర్హల్ అసెంబ్లీ స్థానం నుంచి సమాజ్ వాదీ అధ్యక్షుడు , మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తొలి సారిగా బరిలోకి దిగారు. ఆయనపై పోటీగా కేంద్ర సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘెల్‌ను బీజేపీ రంగంలోకి దిపింది. అటు బీఎస్పీ నుంచి కుల్దీప్ నారాయణ్ బరిలో నిలిపింది. ప్రతిష్టాత్మకమైన ఈస్థానానికి ఆదివారం పోలింగ్ జరిగింది. అయితే ఇక్కడ ఎస్పీ కార్యకర్తలు బోగస్ ఓట్లు వేశారని, పెద్ద ఎత్తున్న‌ రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, బెదిరింపులకు దిగార‌ని బీజేపీ అభ్యర్థి ఎస్పీ సింగ్ బఘెల్ ఆరోపించారు.

 ఎస్పీపై ఈసీకి ఫిర్యాదు

ఎస్పీపై ఈసీకి ఫిర్యాదు

దన్నహార్‌లోని బూత్ నంబర్ 64, 110 పరిధిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఎస్పీ సింగ్ బఘెల్ ఆరోపించారు. మాహిళలను చాలా సేపు నిలబెట్టి దొంగ ఓట్లు వేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి , ఉత్తరప్రదేశ్‌ లక్నో చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఫిర్యాదు చేశారు. అఖిలేష్‌తోపాటు రిగ్గింగ్ పాల్పడిన ఎస్పీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

 పోలీసుల‌కు బెదిరింపులు

పోలీసుల‌కు బెదిరింపులు


పోలింగ్ కేంద్రంలోనే ఎస్పీ కార్యకర్తలు పలువురిపై దాడి చేసి.. ఓటర్లను భయబ్రాంతులకు గురిచేశారని బఘెల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల ఓట్లను కూడా వారే వేసుకున్నారని మండిపడ్డారు . పోలీసులను సైతం బెదిరింపులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.

English summary
BJP SP Singh Baghel complains to elction commission alleging booth capturing in karhal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X