వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యడ్యూరప్పను ఓడించబోతున్నాం, బీజేపీ హైజాక్ చేసిన ఇద్దరు రేపు మా క్యాంపులోకే!: కుమారస్వామి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికే నిన్న రాత్రి హైదరాబాద్ రావాల్సి వచ్చిందని జేడీఎస్ కర్ణాటక అధ్యక్షుడు కుమారస్వామి అన్నారు. ఎమ్మెల్యేలను నోవాటెల్ హోటల్ నుంచి బెంగళూరు తరలించడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.

బలనిరూపణ గడువును రేపటికే కుదిస్తూ సుప్రీం చారిత్రక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. ప్రస్తుతం తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్ నుంచి బెంగళూరు తరలిస్తున్నట్టు చెప్పారు.రేపటి బలనిరూపణ సందర్భంగా కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి హాజరవుతారని తెలిపారు. బలనిరూపణలో బీజేపీని కాంగ్రెస్, జేడీఎస్ ఓడించబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు.

kumara

మా ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని గాలి జనార్దన్ రెడ్డి, బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రోత్సహించవద్దని కుమారస్వామి మీడియాకు విజ్ఞప్తి చేశారు. తమ ఎమ్మెల్యేలు ఇద్దరిని బీజేపీ హైజాక్ చేసిందని, వారిద్దరు ఇప్పుడు తమతో టచ్ లోకి వచ్చారని, రేపు తిరిగి మా క్యాంపులో చేరుతారని తెలిపారు.

యడ్యూరప్ప ఒత్తిడితోనే ప్రొటెం స్పీకర్ గా బోపన్నను ఎంపిక ఖరారైందని కుమారస్వామి ఆరోపించారు. 2010లో స్పీకర్ అధికారాన్ని దుర్వినియోగం చేసినందుకు సుప్రీం ఆయనపై అక్షింతలు వేసిందని గుర్తుచేశారు.

ప్రస్తుతం కాంగ్రెస్ మిత్రులు కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరుతున్నారని చెప్పారు. మరో విషయం చెప్పడం మరిచిపోయానని, బీఎస్పీ తరుపున గెలిచిన మహేష్ కూడా మాతోనే ఉన్నారని కుమారస్వామి స్పష్టం చేశారు.

ఇక బీజేపీ ఎమ్మెల్యేలు జేడీఎస్ తో టచ్ లో ఉన్నారన్న ప్రచారంపై స్పందిస్తూ.. అవునని సమాధానం చెప్పారు కుమారస్వామి. అయితే బీజేపీ లాగా ఎమ్మెల్యేలను లాక్కునే అవసరం తమకేమి లేదని, తమకు పూర్తి స్థాయి మెజారిటీ ఉందని చెప్పుకొచ్చారు.

Newest First Oldest First
12:09 AM, 19 May

జేడీఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ఆ పార్టీ సీఎం అభ్యర్థి హెచ్.డి కుమారస్వామి హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరుకు బయలుదేరారు.

English summary
Before leaving from Hyderabad JDS President Kumaraswamy talked to media. He alleged BJP hijacked their two MLA's, he added those are joining with us tomorrow
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X