వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడే అవిశ్వాసం: టీడీపీ సహా విపక్షాల వ్యూహాలు, ధీటుగా బీజేపీ, మిత్రపక్షాలు దూరమైనా ఢోకాలేదు

|
Google Oneindia TeluguNews

Recommended Video

అవిశ్వాస తీర్మానంపై ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగం

న్యూఢిల్లీ: లోక్‌సభలో నేడే(శుక్రవారం ఉదయం) అవిశ్వాస తీర్మానం చర్చకు రానున్న నేపథ్యంలో అధికార, విపక్షాలు పదునైన వ్యూహాలతో సమరానికి సిద్ధమయ్యాయి. తిరుగులేని ఆధిక్యంతో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం శుక్రవారం తొలి అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో గురువారం అధికార, విపక్ష శిబిరాలు తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో, మద్దతు కూడగట్టుకోవడంలో తలమునకలయ్యాయి.

 టీడీపీనే ప్రారంభిస్తుంది..

టీడీపీనే ప్రారంభిస్తుంది..

విభజన చట్టపరంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ అమలులో విఫలమైన కేంద్ర ప్రభుత్వ వైఖరిని దేశవ్యాప్తంగా అందరికీ తెలియజెప్పాలన్న ఉద్దేశంతో టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం ఉదయం 11 గంటలకు గల్లా జయదేవ్‌ ప్రసంగంతో చర్చ మొదలై సాయంత్రం 6కు ముగుస్తుంది.అనంతరం ప్రధాని ఇచ్చే సమాధానంపై సభ్యులు వివరణ కోరవచ్చు. ఆ తర్వాత ఓటింగ్‌ జరుగుతుంది.

విపక్షాలు టార్గెట్ అదే..

విపక్షాలు టార్గెట్ అదే..

అయితే, అవిశ్వాసంలో ఓడిపోతామన్న భయం అధికార పక్షానికి మాత్రం లేదు... గెలుస్తామన్న ధీమాలో విపక్షాలూ లేవు. ఎదుటిపార్టీని ఎంత గట్టిగా ఎండగట్టాలి, రాజకీయంగా ఎలా పైచేయి సాధించాలన్నదానిపైనే అన్ని పక్షాలూ దృష్టి సారించాయి. స్పీకర్‌ను మినహాయించి 533 మంది ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభలో అవిశ్వాసం నెగ్గాలంటే అధికారపార్టీకి 267 మంది మద్దతు లభిస్తే సరిపోతుంది. సొంతంగానే 273 మంది బలం ఉన్న అధికారపార్టీకి మిత్రపక్షాలతో కలిపితే 316 మంది మద్దతు లభిస్తోంది.

టీఆర్ఎస్ సహా పలు పార్టీలు దూరమే

టీఆర్ఎస్ సహా పలు పార్టీలు దూరమే

ఇక అవిశ్వాసం ప్రతిపాదించిన ప్రతిపక్షాలకు 146 మందికి మించి బలం కనిపించడంలేదు. ఈ వాస్తవం అందరికీ ముందే తెలియడంతో గెలుపోటముల గురించి ఎవ్వరూ మాట్లాడుకోవడంలేదు. ఇప్పటివరకూ తటస్థంగా కనిపించిన పార్టీలు ఓటింగ్‌ సమయంలో ఎటువైపు మొగ్గుతాయన్నదానిపైనే ఆసక్తి నెలకొంది. 37 పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభలో అన్నాడీఎంకే, బీజేడీ, టీఆర్ఎస్ మినహా మిగిలిన పార్టీలన్నీ ఇప్పటికే ఏదో ఒక వైఖరి చెప్పాయి. 68 మంది సభ్యులున్న ఈ మూడు పార్టీలు ఓటింగ్‌కు దూరంగా ఉంటాయన్న ప్రచారం ఉంది.
స్థానిక పరిస్థితులు, అవిశ్వాసం ప్రతిపాదించిన పార్టీలపట్ల వీరికున్న రాజకీయ అభిప్రాయాల దృష్ట్యా అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకూడదని ఈ పార్టీలు నిర్ణయించాయి.

చీల్చి చెండాడేందుకు బీజేపీ రెడీ

చీల్చి చెండాడేందుకు బీజేపీ రెడీ

ఓటింగ్‌ జరిగినప్పుడు మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయాలా? తటస్థంగా ఉండాలా? అన్నదానిపై వైఖరిని ఇంకా స్పష్టం చేయలేదు ఈ పార్టీలు. ఓటింగ్‌కు ఈ మూడు పార్టీలు దూరమైతే సభలోని సభ్యుల సంఖ్య 465కి పడిపోతుంది. అప్పుడు అధికారపార్టీ 233 ఓట్లు దక్కించుకుంటే సరిపోతుంది. బీజేపీకి తన మిత్రపక్షాలు కూడా మద్దతు ఇవ్వకున్నా అధికారం నిలుపుకునే బలం ఉంది. దీంతో కేంద్రం ధీమాగా ఉంది. అంతేగాక, తమకు వచ్చిన ఈ అవకాశాన్ని విపక్షాలను చీల్చి చెండాడేందుకు ఉపయోగించుకోవాలనే ఆలోచనతో ఉంది. తాము చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు విపక్షాల తీరును ఎండట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

English summary
The Narendra Modi government is set to win the no-confidence motion in the Lok Sabha today. The BJP led NDA appears to be confident of winning the motion comfortably as it has the required numbers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X