వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ తో దీపావళి .. సంతోషాల కేళి

|
Google Oneindia TeluguNews

పండుగలు ఏవైనా అందరం సంతోషంగా జరుపుకోవాలి. పర్యావరణాన్ని కాపాడాలి . ప్రకృతితో మమేకమైన మాన జీవన సౌందర్యాన్ని సంతోషంగా ఆస్వాదించాలి. కానీ రోజు రోజుకీ మనం కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాం . పర్యావరణ కాలుష్యం, శబ్ద కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇక దీపావళి సమయంలో ఇది మరింతగా పెరుగుతుంది. అందుకే ఈ దీపావళిని ధ్వని, పర్యావరణ కాలుష్య రహితంగా చేసుకోటానికి అందరం మన వంతు ప్రయత్నం చెయ్యాల్సిన అవసరం ఉంది.

ఢిల్లీలో చాలా కాలంగా నో క్రాకర్స్ డే గా దీపావళి

ఢిల్లీలో చాలా కాలంగా నో క్రాకర్స్ డే గా దీపావళి

దీపావళి అనగానే అందరికీ ముందు గుర్తొచ్చేవి బాణా సంచా .. దీపావళి టపాసులు . ఇప్పటికే విపరీతమైన కాలుష్యం కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో నో క్రాకర్స్ డే గా దీపావళిని చాలా సంవత్రాలుగా జరుపుకోవాలని ప్రభుత్వం చెప్తోంది. ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాద కర స్థాయిలో పెరిగింది. అక్కడి గాలిలో సేఫ్టీ స్టాండర్డ్ కన్నా40 రెట్ల ఎక్కువ కాలుష్యం పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. దీంతో ఢిల్లీలో చాలా కాలంగా దీపావళి రోజు నో ఫైర్ క్రాకర్స్ డేగా జరుపుకోవాలని భావిస్తూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

మెట్రో నగరాల్లో విపరీతంగా పెరిగిన కాలుష్య

మెట్రో నగరాల్లో విపరీతంగా పెరిగిన కాలుష్య

ఇక ఇప్పుడు ఢిల్లీ మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా మెట్రో నగరాల్లో విపరీతమైన కాలుష్యం పెరిగింది. ఇప్పటికే ఊపిరితిత్తుల వ్యాధులు కూడా మెట్రో నగరాల్లో చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ఇదే సమయంలో బాణా సంచా కాల్చటం వల్ల చాలా కాలుష్యం జరుగుతుందని,పలు దుష్పరిణామాలు కలుగుతున్నాయని కూడా అర్ధం అవుతుంది. అందుకే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని రసాయనాలతో తయారు చేసిన క్రాకర్స్ కాల్చకుండా ఉంటేనే మంచిది అని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.

ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ తో సంబరాలు శ్రేయస్కరం

ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ తో సంబరాలు శ్రేయస్కరం

దీపావళిలో ఎక్కువగా బాణాసంచా కాలుస్తారు. బాణా సంచా లేకుంటే పండుగ సంబరమే లేదని చాలా మంది ఫీల్ అవుతారు. అలాంటి వారి కోసం ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ కూడా మార్కెట్ లోకి వచ్చాయి. కాన్‌ఫెట్టి, ఫ్లవర్ పవర్,ఫేక్‌నోట్, బర్ట్స్,స్నేక్‌మిక్స్‌లాంటి పేర్లతో పర్యావరణానికి హాని కలిగించని క్రాకర్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవి మామూలు బాణాసంచాలా కాకుండా, వాతావరణానికి ఎలాంటి హాని కలిగించనటువంటివి. వీటి శబ్దం కూడా పరిమిత దూరం వరకే వినిపిస్తుంది. అలాగే కాలుష్యం కలిగించని రంగురంగుల మెరుపులను ఇవి వెదజల్లుతాయి. కేవలం గన్‌పౌడర్, ఫాస్పేట్‌ను మాత్రమే ఉపయోగించి ఆధునిక టెక్నాలజీతో ఈ వెరైటీ బాణాసంచాను తయారు చేస్తున్నారు.

ఎకో ఫ్రెండ్లీ దీపావళి ఆనందమే కాదు ఆరోగ్యం కూడా

ఎకో ఫ్రెండ్లీ దీపావళి ఆనందమే కాదు ఆరోగ్యం కూడా

ఇక ఎకో ఫ్రెండ్లీగా కాకుండా ఉండే బాణా సంచా పర్యావరణానికి చాలా హాని కలిగిస్తుంది. అంతే కాదు వాటి పొగ వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఇక విపరీతమైన శబ్దాల వల్ల చెవులు దెబ్బతినే ప్రమాదం సైతం ఉంది. ఏది ఏమైనా మనకు, మన పర్యావరణానికి హాని కలిగించే బాణా సంచాకు నో చెప్పి,దీపాలంకరణలతో,ఎకో ఫెండ్లీ క్రాకర్స్ ను కూడా చాలా తక్కువ వినియోగిస్తూ పండుగ జరుపుకుంటే ఆనందమే కాదు ఆరోగ్యం .

English summary
Diwali should be celebrated without any hazard to nature, sound and environmental pollution. Most of the fireworks are burned during Diwali. Eco-friendly crackers have also come into the market for such ones. Environmentally harmless crackers such as confetti, flower power, faknot, birts and snakemix are found in the market. Ones that do no harm to the environment. Their sound is also heard over a limited distance. They also emit colorful lightning that does not cause pollution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X