వారిపై సస్పెన్షన్ ఎత్తివేసే ఛాన్స్: లగడపాటిపై సస్పెన్స్

తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంపీలు సభలో లేకుంటే ఎలా అని పలు పార్టీలు ప్రశ్నించాయి. బిజెపి కూడా ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేతను పరిశీలిస్తామని స్పీకర్ కార్యాలయం తెలిపింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ సస్పెన్షన్ ఎత్తివేత తీర్మానాన్ని ప్రవేశ పెట్టే అవకాశముంది. అయితే, పెప్పర్ స్ప్రే చేసిన ఎంపి లగడపాటి రాజగోపాల్, కత్తి తీసుకు వచ్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎత్తివేతపై సస్పెన్స్ ఉంది.
ఉన్నతాధికారులతో షిండే భేటీ
హోంశాఖ ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే మంగళవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. కొన్ని సవరణల పైన వారి నుండి అభిప్రాయాలు తీసుకున్నారు. కాగా, కేంద్రం 62వ సవరణలు తీసుకు వచ్చే అవకాశముంది.












Click it and Unblock the Notifications