వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: '42 యాప్‌లతో చైనా గూఢచర్యం', ఆ యాప్‌లివే!

చైనా భారత్‌ దేశ రహస్యాలను అత్యంత పకడ్బందీ ప్లాన్‌తో సేకరిస్తోందని భారతీయ నిఘా సంస్థ(ఐబీ) హెచ్చరించింది. చైనాకు చెందిన 42 యాప్‌ల సహయంతో చైనా ఇండియా రహస్యాలను సేకరిస్తోందని ఐబీ హెచ్చరించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చైనా భారత్‌ దేశ రహస్యాలను అత్యంత పకడ్బందీ ప్లాన్‌తో సేకరిస్తోందని భారతీయ నిఘా సంస్థ(ఐబీ) హెచ్చరించింది. చైనాకు చెందిన 42 యాప్‌ల సహయంతో చైనా ఇండియా రహస్యాలను సేకరిస్తోందని ఐబీ హెచ్చరించింది.

డోక్లామ్ వద్ద చైనా, ఇండియాకు మధ్య వివాదం విషయంలో రెండు దేశాలు చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకొన్నాయి.అయితే పాక్‌కు మొదటి నుండి చైనా మద్దతుగా నిలుస్తోంది. అయితే చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ విషయంలో ఇండియా తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది.

చైనా-పాక్ కారిడార్‌‌: ఇండియా-పాక్‌ల మధ్య యుద్ధం?: మైఖేల్‌ కూగల్‌మెన్‌ సంచలనంచైనా-పాక్ కారిడార్‌‌: ఇండియా-పాక్‌ల మధ్య యుద్ధం?: మైఖేల్‌ కూగల్‌మెన్‌ సంచలనం

ఈ ఎకనామిక్ కారిడార్‌తో ఇండియా పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకొనే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలోనే ఐబీ హెచ్చరికలు చైనాకు చెందిన యాప్‌ల విషయమై ప్రకటించడం కలకలం రేపుతోంది.

చైనా-పాక్ కారిడార్: రూట్ మార్పుకు నో చెప్పిన డ్రాగన్చైనా-పాక్ కారిడార్: రూట్ మార్పుకు నో చెప్పిన డ్రాగన్

42 యాప్‌లతో ఛైనా గూఢచర్యం

42 యాప్‌లతో ఛైనా గూఢచర్యం

42 ఆండ్రాయిడ్‌ యాప్‌ల ద్వారా చైనా భారత్‌పై గూఢచర్యం చేస్తోందని భారతీయ నిఘా సంస్ధ(ఐబీ) వెల్లడించింది. సైనికులందరూ ఆ యాప్‌లను తమ మొబైళ్ల నుంచి తొలగించాలని సూచించింది. భారత్‌కు చెందిన భద్రతా వ్యవస్థల విషయాలను ఈ యాప్‌ల ద్వారా చైనా తెలుసుకుంటున్నట్లు పేర్కొంది.

ఆర్మీ తమ మొబైళ్ళు ఫార్మెట్ చేయాలి

ఆర్మీ తమ మొబైళ్ళు ఫార్మెట్ చేయాలి

వాస్తవాధీన రేఖ వద్ద రక్షణ విధుల్లో ఉంటున్న సైనికులందరూ తమ మొబైళ్లను ఫార్మాట్‌ చేయాలని ఇంటిలిజెన్స్‌ డీఐజీ సూచనలు చేశారు. వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న ఆర్మీ ఉపయోగిస్తున్న మొబైళ్ళలో ఉపయోగించే యాప్‌ల సహకారంతోనే చైనా గూఢచర్యానికి పాల్పడుతోందని ఐబీ రహెచ్చరించింది. ఇక్కడ పనిచేసే ఆర్మీ సిబ్బంది తమ మొబైళ్ళలోని చైనాకు చెందిన యాప్‌లను డిలీట్ చేయాలని ఐబీ సూచించింది.

చైనా యాప్‌లు ఇవే

చైనా యాప్‌లు ఇవే


వియ్‌ చాట్‌, ట్రూ కాలర్, వీబో, యూసీ బ్రౌజర్, యూసీ న్యూస్‌ తదితర 42 యాప్‌లు భారత్‌కు అత్యంత ప్రమాదకరమని ఇంటలిజెన్స్ హెచ్చరించింది. ఈ యాప్‌లను వెంటనే తమ ఫోన్ల నుండి డిలీట్ చేయాలని ఐబీ ఆదేశాలు జారీ చేసింది.

చైనా ఫోన్లలో ఉపయోగిస్తే ప్రమాదం

చైనా ఫోన్లలో ఉపయోగిస్తే ప్రమాదం

చైనా మొబైళ్లలో ఈ 42 యాప్‌లను వినియోగించడం అత్యంత ప్రమాదకరమని ఐబీ హెచ్చరించింది. తెలిపారు. దేశ రక్షణకు సంబంధించిన సమాచారం తస్కరణకు గురయ్యే అవకాశం ఉందని ఐబీ స్పష్టం చేసింది. ఈ యాప్‌లను వాడకూడదని ఐబీ ఆదేశించింది. ముఖ్యంగా ఆర్మీలో పనిచేసే వారు ఈ యాప్‌లను ఉపయోగించకూడదని ఐబీ సూచించింది.

English summary
In a fresh advisory issued to the troops posted at the international border, the Intelligence Bureau (IB) has warned that China could be collecting vital information about the Indian security installations through its popular mobile phone apps and devices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X