స్మృతి ఇరానీ సెటైర్లు: కాంగ్రెస్ శ్రేణుల జోష్, చరిత్రలో ఏ ప్రధానికి ఇలా కాలేదు
పంజాబ్ పర్యటనలో ప్రధాని మోడీకి చుక్కెదురైన సంగతి తెలిసిందే. రైతు నేతలు, శ్రేణుల నుంచి అనూహ్యంగా నిరసన ఎదురైంది. దీనిపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కూడా స్పందించారు. ప్రధాని మోడీని ఇలా ట్రీట్ చేయడం సరికాదన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదని ఆమె చెప్పారు. ఇందుకు పంజాబ్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమె అన్నారు.
మోడీ పర్యటనలో భద్రతా లోపంపై పంజాబ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతల నిర్వహణలో ఫెయిల్ అయ్యిందని చెప్పారు. కానీ కాంగ్రెస్ శ్రేణులు మాత్రం సంతోషంగా ఉన్నారని మండిపడ్డారు. ఫ్లై ఓవర్ ప్రధాని 20 నిమిషాలు ఆగితే కాంగ్రెస్ శ్రేణులు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారని కామెంట్ చేశారు.

ప్రధాని మోడీ అంటే కాంగ్రెస్ శ్రేణులకు ద్వేషం.. కానీ ఇవాళ హానీ తలపెట్టాలని చూశారని మండిపడ్డారు. ఇంత జరుగుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చేష్టలుడిగి చూసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ యూత్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ 'మోడీ.. జోష్ ఎలా ఉంది' అని ట్వీట్ చేశారు. దీనిపై బీజేపీ ధీటుగానే స్పందించింది. ఘటనకు పంజాబ్ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కోరారు. ప్లై ఓవర్ ఘటన తర్వాత ప్రధాని మోడీ ఫిరోజ్ పూర్ ర్యాలీలో పాల్గొనలేదు. అక్కడినుంచి వెనుదిరిగారు.
Recommended Video
ప్రధాని పర్యటన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా తగిన భద్రతా ఏర్పాట్లు చేశామని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జి నాగేశ్వరరావు నిన్ననే తెలిపారు. ఫిరోజ్‌పూర్ జిల్లాలో సుమారు 10,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించామని చెప్పారు. యాంటీ డ్రోన్ బృందాన్ని కూడా మోహరించినట్లు అధికారులు తెలిపారు. పంజాబ్ పోలీసులు, ఎన్‌ఎస్‌జి, ఆర్మీ మరియు బిఎస్‌ఎఫ్‌తో సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపినా.. హై టెన్షన్ నేపథ్యంలో అక్కడికి మోడీ వెళ్లలేకపోయారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications