చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లీడర్ లేని...: జల్లికట్టు నిరసనపై లారెన్స్ సంచలనం

జల్లికట్టు ఆందోళనపై రాఘవ లారెన్స్ సంచలన ప్రకటన చేశారు. నాయకుడు లేని నిరసనను పోలీసులు అదునుగా తీసుకున్నారని ఆరోపించారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: జల్లికట్టు కోసం చేసిన ఉద్యమానికి నాయకుడు లేనందునే పరిస్థితి అదుపు తప్పిందని, నాయకుడు లేకపోవడాన్ని పోలీసులు అదునుగా తీసుకున్నారని నటుడు రాఘవ లారెన్స్‌ తెలిపారు. జల్లికట్టుకు మద్దతుగా మెరీనాలో వారం పాటు సాగిన ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

జల్లికట్టు నిర్వహణకు సంబంధించి తీసుకొచ్చిన చట్టం వివరాలను ఉద్యమంలోని యువకులు పోలీసులను అడిగారని ఆయన చెప్పారు. అప్పుడు పోలీసులు అధికారులు చట్టానికి సంబంధించి ఓ పత్రంలోని వివరాలను చదివి వినిపించారని, అయితే అందులో గవర్నరు సంతకం కూడా లేదని ఆయన చెప్పారు. దాని గురించి ప్రశ్నించగా.. సరైన వివరణ కూడా ఇవ్వలేదని అన్నారు.

వివరణ ఇవ్వకుండా ఉద్యమంలో ఉన్న యువకులను ఎలాగైనా తరిమికొట్టాలని పోలీసులు భావించి అందరూ వెళ్లిపోవాలని మైక్‌లో చెప్పారని లారెన్స్ గుర్తు చేశారు. అయితే తమకు రెండు గంటల సమయం కావాలని విద్యార్థులు కోరినప్పటికీ పోలీసులు వినలేదని చెప్పారు. ఇంతలో తాను అక్కడకు వెళ్లి పోలీసులను రెండు గంటల సమయం కోరానని, వారు కూడా అందుకు అంగీకరించారని తెలిపారు.

Cops took advantage of leaderless crowd: Raghava Lawrence

జల్లికట్టుకు ప్రత్యేక చట్టం విషయంలో మనం విజయం సాధించామని, ఇక ఆందోళన విరమించుకుందామని చెప్పడంతో చాలా వరకు యువకులు వెళ్లిపోయారని అన్నారు. అయితే కొందరు మాత్రం అక్కడే కూర్చొని 'ప్రత్యేక తమిళనాడు' అంటూ నినాదాలు చేశారని గుర్తు చేశారు. అయితే వారు విద్యార్థులు, యువత కాదని చెప్పారు.

దాన్ని పోలీసులు అనుకూలంగా మలుచుకుని వెంటనే లాఠీఛార్జీ చేశారని చెప్పారు. నిజానికి ఈ ఉద్యమానికి సరైన నాయకుడు లేనందువల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు.

English summary
Tamil Nadu Director and actor Raghava Lawrence, played a key role in Jallikattu protest, said that Cops took advantage of leaderless crowd
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X