సంక్షోభం వేళ.. ఇండిగో సంస్థకు కేంద్రం బిగ్ షాక్..
ఇండిగో కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా వందలకొద్దీ విమానాలు రద్దవుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విమాన సర్వీసుల తీవ్ర అంతరాయం కారణంగా విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, చిన్నారులు అనేక మంది బాధపడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో విమాన సర్వీసులను 10 శాతం తగ్గించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాలతో రోజుకు 200లకు పైగా ఇండిగో విమానాలు క్యాన్సిల్ కానున్నాయి. మరోవైపు కేంద్రం నిర్ణయంపై ఇండిగో సంస్థ స్పందించింది. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూనే అన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులను కొనసాగిస్తామని పేర్కొంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం నెలకున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో సేవలను 10 శాతం తగ్గించాలని ఆ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. అలాగే ఇండిగో సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ కూడా హాజరయ్యారు. కేంద్రం ఆదేశాలపై స్పందించిన ఇండిగో సంస్థ.. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూనే అన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులను కొనసాగిస్తామని పేర్కొంది. కేంద్రం ఆదేశాలతో రోజుకు దాదాపు 200 లకుపైగా ఇండిగో విమానాలు రద్దు అవుతాయని ఇండిగో సంస్థ అంచనా వేస్తోంది.
ఇండిగో సంస్థ సంక్షోభం నుంచి బయటపడేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఈ సూచనలు చేసినట్లు తెలుస్తోంది. విమాన సర్వీసులను 10 శాతం తగ్గిస్తే పైలట్లు, సిబ్బంది, టెక్నికల్ టీమ్.. ఇతర అధికారులు, స్టాఫ్ పై ఒత్తిడి తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది. వెంటనే ఈ ఆదేశాలను అమలు చేయాలని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. మరోవైపు.. ఇండిగో సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తున్నట్లు తెలిపారు. ఇవాళ(మంగళవారం) కూడా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయని.. కానీ కార్యకలాపాలు మాత్రం సాధారణ స్థితికి వస్తున్నట్లు పీటర్ ఎల్బర్స్ స్పష్టం చేశారు.

ఇక దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభంపై సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు లోక్ సభలో ప్రసంగించారు. ఇండిగో సంక్షోభానికి ఇండిగో సంస్థనే బాధ్యత వహించాలని తెలిపారు. విమానయాన సేవలు క్రమంగా సాధారణ స్థితికి చేరుతున్నాయని లోక్ సభలో వివరించారు. రద్దయిన విమానాలకు సంబంధించిన రీఫండ్, లగేజీ విషయాలతో పాటు ఎయిర్ పోర్టుల్లో రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications