వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబ్బులు ఇవ్వని బ్యాంకులపై దాడి చేసిన జనం

పెద్ద నగదు నోట్లు రద్దుచేసి 20 రోజులు దాటినా కొత్త కరెన్సీ కొసం ప్రజలు ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నారు. వారానిక 24 వేల రూపాయాలను డ్రా చేసుకొనే అవకాశం కల్పించినా ,మణిపూర్ లో బ్యాంకు అధికారులు వారానికి క

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఇంఫాల్ :పెద్ద నగదు నోట్లు రద్దు చేయడం, ప్రజల డిమాండ్ మేరకు కొత్త కరెన్సీ అందుబాటులోకి రాకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్ రాష్ట్రంలోని రెండు ఎస్ బి ఐ బ్యాంకులపై ప్రజలు దాడి చేశారు. ఈ ఘటనలో ఓ పోలీసు కూడ గాయపడ్డాడు.

పెద్ద నగదు నోట్లను రద్దు చేసిన కేంద్రం కొత్త కరెన్సీని అందుబాటులోకి తెచ్చింది. అయితే కొత్త కరెన్సీ ప్రజల డిమాండ్ మేరకు అందుబాటులో లేదు. ఈ కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద నగదు నోట్లు రద్దు చేసి ఇరవై రోజులు దాటినా పరిస్థితిలో మార్పు లేకపోయింది.

customers attack on banks in mijoram

వారానికి ప్రతి ఒక్క కస్టమర్ తన బ్యాంకు ఖాతా నుండి 24 వేల రూపాయాలను డ్రా చేసుకొనే వీలు కల్పించింది కేంద్రం. అయితే ఈ మేరకు బ్యాంకులు డ్రా చేసుకొనే అవకాశం కల్పించడం లేదు. ప్రజల డిమాండ్ ఎక్కువగా ఉంది. కాని, బ్యాంకులు మాత్రం కేంద్రం ప్రకటించినట్టుగా కరెన్సీని ఇవ్వడం లేదు.

బ్యాంకు ఖాతా నుండి 24 వేల రూపాయాలను డ్రా చేసుకొనే అవకాశం ఉంది. అయితే వారానికి రెండు లేదా నాలుగు వేలు మాత్రమే తీసుకోవాలని మణిపూర్ లోని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఎటిఎంలలో డబ్బులు లేవు, నేరుగా బ్యాంకుల నుండి డబ్బులు డ్రా చేసుకోవడంలో మాత్రం లేని నిబంధనలు పెడుతున్నారంటూ ఖాతాదారులు సోమవారం నాడు రెండు బ్యాంకుల పై దాడులు చేశారు. బ్యాంకుల్లోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పోలీసు కూడ గాయపడ్డారు.

English summary
currency ban effect on people, after 20 dyas people suffer for new currency.any customer draw 24000 rupees every week,butin the manipur state bankers allow 4000 rupees only.on monday people were attack two banks ,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X