Cyclone Ditwah మహోగ్రం: తమిళనాడులో కల్లోలం- ముగ్గురు దుర్మరణం
బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వ తుఫాను తీరానికి సమీపించింది. తమిళనాడు ఉత్తరం ప్రాంతం, పుదుచ్చేరి, ఏపీ దక్షిణ తీరం వైపు కదులుతోంది. ఈ క్రమంలో ఈ మూడు చోట్లా అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. డిజాస్టర్ రెస్పాన్స్ సిబ్బందిని తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో మోహరించింది.
శ్రీలంక తీరం, దాని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో బలపడిన దిత్వ తుఫాను.. నెమ్మదిగా ఉత్తరం వైపు కదులుతోంది. తమిళనాడులోని కారైకల్ కు దక్షిణ-ఆగ్నేయ దిశలో 80, పుదుచ్చేరికి దక్షిణ-ఆగ్నేయ దిశలో 160, చెన్నైకి దక్షిణ-ఆగ్నేయ దిశలో 250 కిలో మీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాను శ్రీలంక తీరం, బంగాళాఖాతం నైరుతి- వాయువ్య దిశలో కదులుతోంది.

తమిళనాడు ఉత్తర ప్రాంతం, పుదుచ్చేరి, ఏపీ దక్షిణ ప్రాంత తీరాలకు మరింత చేరువ కానుంది. దీని ప్రభావంతో నేటి నుంచి మూడు రోజుల పాటు ఏపీలో కుండపోతగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రత్యేకించి- రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో నేడు దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కరుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
అటు తమిళనాడులో ఈ తుఫాన్ విలయం సృష్టిస్తోంది. అతలాకుతలం చేస్తోంది. తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఈ విపత్తు కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 57,000 హెక్టార్ల వ్యవసాయ భూమి దెబ్బతింది. అలాగే 149 పశువులు మరణించినట్లు రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ ఆదివారం వెల్లడించారు. తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు తూత్తుకుడి, తంజావూరులో గోడ కూలి ఇద్దరు చనిపోగా, మైలాడుతురైలో విద్యుత్ షాక్‌తో 20 ఏళ్ల యువకుడు మరణించినట్లు మంత్రి తెలిపారు.
డెల్టా జిల్లాల్లో వ్యవసాయ భూములకు జరిగిన నష్టాన్ని మంత్రి వివరించారు. నాగపట్నంలో 24,000 హెక్టార్లు, తిరువారూర్ జిల్లాలో 15,000 హెక్టార్లు, మైలాడుతురైలో 8,000 హెక్టార్ల భూమి దెబ్బతిన్నాయి. మొత్తంగా 57,000 హెక్టార్ల సాగు భూములు నీట మునిగాయని రామచంద్రన్ పేర్కొన్నారు. డెల్టా జిల్లాల్లో దాదాపు 234 గుడిసెలు ధ్వంసమయ్యాయని మంత్రి తెలిపారు. విపత్తు సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సహా 28 బృందాలను సిద్ధం చేశారు. ఇతర రాష్ట్రాల నుండి అదనంగా 10 బృందాలు తమిళనాడుకు చేరుకున్నాయి.
ఇదిలా ఉండగా గత 24 గంటల్లో పుదుచ్చేరిలోని కారైకల్‌లో అత్యధికంగా 19 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మైలాడుతురై జిల్లాలోని సెంబనార్ కోయిల్‌లో ఆదివారం ఉదయం 8:30 గంటల నాటికి 17 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. తుఫాను ప్రభావంతో రాబోయే 24 గంటల్లో కడలూరు, నాగపట్నం, మైలాడుతురై, విల్లుపురం, చెంగల్పట్టు, పుదుక్కోట్టై, తంజావూరు, తిరువారూర్, అరియలూరు, పెరంబలూరు, తిరుచిరాపల్లి, చెన్నై, కాంచీపురం, తిరువళ్ళూరు, రాణిపేట్ జిల్లాల్లో, పుదుచ్చేరి, కారైకల్‌లో భారీ నుండి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications