వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పేమిటి: శ్వేతా బసుకు దీపికా పడుకొనే బాసట

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: వ్యభిచారం చేస్తూ పట్టుబడిన కొత్త బంగారు లోకం హీరోయిన్ శ్వేతా బసుకు నైతిక మద్దతు పెరుగుతోంది. శ్వేతా బసు విషయంపై టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా శుక్రవారంనాడు ఈ వ్యవహారంపై బాలీవుడ్ నటి దీపికా పడుకొనే స్పందించింది. తన కుటుంబాన్ని ఆదుకునే మార్గమూ, తనను తాను నిలదొక్కుకునే మార్గమూ అదొక్కటే అని శ్వేతా బసు భావించినట్లయితే ఆ మార్గం ఆమె ఎంచుకోవడంలో తప్పేముందంటూ ప్రశ్నించింది.

డబ్బు సంపాదనకు శ్వేతా బసుకు కనబడిన మార్గం అదొక్కటే అయినపుడు దాన్ని తప్పు అని ఎలా అంటారంటూ అందాల భామ దీపికా పడుకొనే అన్నది. అంతా శ్వేతా బసు సెక్స్ స్కాండల్ అంటూ సంబోధించడం అర్థరహితమనీ, ఆమె పరిస్థితిని అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు. ఆమెకు సహాయం చేయాల్సిందిపోయి ఆమె మానసిక స్థయిర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం విచారకరమని దీపికా వ్యాఖ్యానించింది.

Deepika Padukone supports Swtha Bas Prasad

మరో నటి రాణీ ముఖర్జీ మాత్రం శ్వేతా బసు అంశంపై తాను స్పందించలేనని చెప్పారు. టాలీవుడ్ నుంచి రాంగోపాల్ వర్మ కూడా వివరాలు పూర్తిగా తెలియకుండా తానేమీ మాట్లాడబోనని అంటూ ముగించారు. ఇంకా మంచు విష్ణు మాత్రం తన తదుపరి చిత్రంలో ఖచ్చితంగా శ్వేతా బసుకు అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు.

మొత్తమ్మీద 11 ఏళ్ల వయసులో బాలనటిగా జాతీయ అవార్డును గెలుచుకున్న శ్వేతా బసు నటిగా మాత్రం అవకాశాలు లేక ఇలా వ్యభిచారం చేస్తూ దొరికిపోవడంపై భారతదేశ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులను కదిలిస్తోంది.సాక్షి తన్వర్‌తో పాటు కరణ్ జోహర్, విశాల్ భరద్వాజ్, హన్సాల్ మెహతా కూడా శ్వేతా బసుకు నైతిక మద్దతు అందించారు.

English summary

 Deepika Padukone has joined the likes of Karan Johar, Vishal Bharadwaj, Hansal Mehta and Sakshi Tanwar, who've all come out in support of beleaguered actress Shweta Basu Prasad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X