• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దారుణం: 9 ఏళ్ల బాలికపై 55 ఏళ్ల పూజారి,ముగ్గురు సిబ్బంది అత్యాచారం,హత్య...

|

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. 9 ఏళ్ల ఓ బాలికపై 55 ఏళ్ల వయసున్న ఓ పూజారి,మరో ముగ్గురు సిబ్బంది కలిసి గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. ఆపై బాలికను హత్య చేసి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో చనిపోయినట్లుగా చిత్రీకరించారు.బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా వారికి మాయ మాటలు చెప్పి మభ్యపెట్టారు. అసలేం జరిగిందో తెలుసుకునే లోపే బాలిక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. బిడ్డ మృతిపై అనుమానాలు వెంటాడటంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇదీ జరిగింది...

ఇదీ జరిగింది...

పోలీసుల కథనం ప్రకారం... ఢిల్లీ కంటోన్మెంట్ పరిధిలోని ఓ ప్రాంతంలో ఓ దహనవాటిక ఉంది. దాని ఎదురుగా ఓ కుటుంబం అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఆ దంపతులకు చెందిన 9 ఏళ్ల బాలిక అప్పుడప్పుడూ ఆ దహనవాటిక ప్రాంగణంలోకి వెళ్తుంటుంది. ఆదివారం(అగస్టు 1) సాయంత్రం 5.30గంటలకు ఆ బాలిక అక్కడికి వెళ్లింది. అక్కడున్న ఫ్రిజ్‌ నుంచి చల్లని నీళ్లు తాగేందుకు ఆమె అక్కడికి వెళ్లినట్లు చెబుతున్నారు. ఏమైందో ఏమో తెలియదు గానీ అరగంట తర్వాత ఆ బాలిక చనిపోయినట్లు దహనవాటికలోని పూజారి ఆ చిన్నారి తల్లికి సమాచారమిచ్చాడు.

విద్యుుత్ షాక్‌తో చనిపోయిందని...

విద్యుుత్ షాక్‌తో చనిపోయిందని...

బాలిక తల్లి పరుగు పరుగున ఆ దహనవాటికకు వెళ్లగా అక్కడ ఆమె మృతదేహం కనిపించింది. ఫ్రిజ్ వాటర్ తాగుతున్న సమయంలో బాలిక విద్యుత్ షాక్‌కి గురై చనిపోయిందని ఆ పూజారి,అక్కడే పనిచేసే మరో ముగ్గురు సిబ్బంది చెప్పారు. బాలిక శరీరంపై పలుచోట్ల కాలిన గాయాలను చూపించారు. అంతేకాదు,దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వొద్దని అన్నారు. ఒకవేళ ఇస్తే... బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిర్వహిస్తారని... ఆమె అవయవాలను అమ్ముకుంటున్నారని లేనిపోని మాటలు చెప్పారు. ఆ బాలిక తల్లికి,కుటుంబ సభ్యులకు ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండానే అదే దహనవాటికలో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

నిరసనకు దిగిన 200 గ్రామాల ప్రజలు

నిరసనకు దిగిన 200 గ్రామాల ప్రజలు

పూజారి,ఆ సిబ్బంది చెప్పిన మాటలపై బాలిక తల్లికి మొదటి నుంచి అనుమానం వెంటాడుతూనే ఉంది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.పూజారి,ముగ్గురు సిబ్బంది బాలికపై అత్యాచారానికి పాల్పడి,హత్య చేసినట్లుగా ఆరోపించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాధేశ్యామ్ అనే ఆ పూజారి,సలీమ్,లక్ష్మీ నారాయణ్,కుల్దీప్ అనే ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ ఘటన గురించి తెలియగానే దాదాపు 200 గ్రామాలకు చెందిన స్థానికులు సోమవారం సాయంత్రం రోడ్ల పైకి వచ్చి నిరసనకు దిగారు.

  CM Jagan Delhi Tour In Next Week Becoming Crucial In AP Politics | Oneindia Telugu
  పూజారిపై కఠిన చర్యలకు డిమాండ్

  పూజారిపై కఠిన చర్యలకు డిమాండ్

  'ఆ పూజారి,ముగ్గురి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేం డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ బాలిక విద్యుత్ షాక్‌తోనే చనిపోయి ఉంటే... ఎందుకని వారు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. అంత హడావుడిగా బాలిక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చింది. నిజానికి సాయంత్రం 6గంటల తర్వాత దహన సంస్కారాలు నిర్వహించరు.పైగా బాలిక తల్లిదండ్రులు అంగీకరించకముందే అంత్యక్రియలు జరిపారు. ఆ పూజారి,ముగ్గురు సిబ్బంది బాలికపై అత్యాచారం చేసి చంపేశారు.' బాలిక ఇంటి చుట్టుపక్కల ఉండేవారు ఆరోపించారు. పోలీసులు అక్కడి సీసీటీవీ ఫుటేజీని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నిజానికి పోలీసులు ఈ ఘటనపై మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. స్థానికుల నిరసన తర్వాతే అత్యాచారం,హత్య కేసులు పెట్టారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

  English summary
  In a shocking incident in Delhi,A 55-year-old priest and three others gang-raped a 9-year-old girl. The girl was then killed and they told it as if she had been accidentally electrocuted.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X