Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డెల్టా వేరియంట్ యమా డేంజర్ .. వ్యాక్సిన్ల నిరోధక శక్తి కంటే డెల్టా వేరియంట్ కు 8 రెట్లు అధిక శక్తి

ఇప్పుడు ప్రపంచం మొత్తం డెల్టా వేరియంట్ పై భయాందోళనకు గురవుతోంది. డెల్టా వేరియంట్ పై జరుగుతున్న అధ్యయనాల ద్వారా షాకింగ్ అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అనేక కొత్త అధ్యయనాలు డెల్టా వేరియంట్లో జరిగిన కీలక ఉత్పరివర్తనలు వ్యాక్సిన్‌ల ప్రభావాన్ని తగ్గించాయని, అంతేకాకుండా కరోనా మహమ్మారి ప్రారంభదశలో కరోనా రోగుల్లో అధికంగా తీవ్రతను చూపించాయని కనుగొన్నారు. వేగవంతమైన వ్యాప్తికి ఆజ్యం పోసే ప్రధాన కారణాలపై ప్రస్తుతం ఇంకా అధ్యయనం జరుగుతోంది. ఇక తాజాగా మరో అధ్యయనం డెల్టా వేరియంట్ వ్యాక్సిన్ల సామర్ధ్యం కంటే 8 రెట్లు అధిక సామర్ధ్యం కలిగి ఉందని తేలింది.

డెల్టా వేరియంట్ కు వ్యాక్సిన్ ల రోగనిరోధక ప్రతిస్పందన నుండి తప్పించుకునే సామర్ధ్యం
ఇటీవల టీకాలు వేసిన వ్యక్తులు కూడా మళ్లీమళ్లీ డెల్టా వేరియంట్ బారిన పడుతున్నట్లు గా గుర్తించారు. డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ డెల్టా వేరుయంట్ ను అత్యంత ట్రాన్స్‌మిసిబుల్ వేరియంట్ అని చెప్పారు. మరియు ఇది చాలా దేశాలలో కోవిడ్ -19 ఆధిపత్య జాతిగా మారుతోందని పేర్కొన్నారు. SARS-CoV2 వైరస్ యొక్క డెల్టా వేరియంట్ యొక్క వేగవంతమైన వ్యాప్తికి సంబంధించిన ఒక కొత్త అధ్యయనం ఈ ప్రత్యేక వైవిధ్యం కరోనా మహమ్మారిని నియంత్రించే టీకాల ద్వారా నిర్మించిన రోగనిరోధక ప్రతిస్పందన నుండి తప్పించుకోవడానికి చాలా ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉందని కనుగొంది.

Delta Dangerous.. Delta variant has 8 times more effective than vaccine immunity

డెల్టాకు రోగనిరోధక శక్తి నుండి తప్పించుకోవడానికి ఎనిమిది రెట్లు అధిక శక్తి
నేచర్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో, భారతదేశం మరియు ఇతర దేశాల పరిశోధకుల బృందం డెల్టా వేరియంట్ (లేదా B.1.617.2 వంశం) అసలుతో పోలిస్తే ఆస్ట్రాజెనెకా లేదా ఫైజర్ వ్యాక్సిన్‌ల ద్వారా పొందిన రోగనిరోధక శక్తి నుండి తప్పించుకోవడానికి ఎనిమిది రెట్లు అధిక శక్తిని కలిగి ఉందని కనుగొన్నారు. అలాగే, డెల్టా వేరియంట్ కోవిడ్ -19 నుండి కోలుకున్న వ్యక్తులకు తిరిగి సోకే అవకాశం ఆరు రెట్లు ఎక్కువగా ఉందని అధ్యయనం ద్వారా వెల్లడించారు. ఈ అధ్యయనం ద్వారా డెల్టా వేరియంట్‌లో "అధిక రెప్లికేషన్ ఎఫిషియెన్సీ" ని కనుగొంది. ఇది సంక్రమించడానికి మరియు B.1.617.2 ఆధిపత్యాన్ని సమర్థవంతంగా కొనసాగించడానికి అధిక శక్తి ఉన్నదని కనుగొన్నారు.

డెల్టా వేరియంట్ కు అధిక రెప్లికేషన్ ఎఫిషియన్సీ
90కి పైగా దేశాలలో డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడానికి గల కారణాలపై అధ్యయనం చేసిన నిపుణుల బృందం అధిక రెప్లికేషన్ ఎఫిషియన్సీ అందుకు కారణమని తేల్చింది. పరిశోధకులు మూడు ఢిల్లీ ఆసుపత్రులలో దాదాపు 9,000 మంది పూర్తిగా టీకాలు వేసిన ఆరోగ్య సంరక్షణ కార్మికులలో పురోగతిని అధ్యయనం చేశారు. ఈ ఆసుపత్రులలో మొత్తం 218 మంది కార్మికులు కోవిషీల్డ్ వ్యాక్సిన్ యొక్క రెండు మోతాదులను తీసుకున్న తర్వాత కూడా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈ గ్రూప్ లో డెల్టా వేరియంట్ యొక్క ప్రాబల్యం ఇతర వేరియంట్‌ల కంటే 5.45 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది.

వ్యాక్సిన్ లు తీసుకున్నా సరే డెల్టా దాడి .. అధ్యయనాల్లో వెల్లడి
మొత్తానికి కరోనా వేరియంట్ కరోనా ని ఇంత కోసం తీసుకున్న వ్యాక్సిన్ ల నుండి ఉత్పన్నమైన రోగనిరోధక వ్యవస్థ నుండి తప్పించుకునే, మళ్లీ వ్యాధిని కలుగజేసే ఎనిమిది రెట్లు అధిక సామర్థ్యాన్ని కలిగి ఉందని అధ్యయనం ద్వారా తెలుస్తోంది. ఇంకా కొనసాగుతున్న అనేక అధ్యయనాలు డెల్టా వేరియంట్ యొక్క వ్యాప్తిని, వేరియంట్ తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. భారతదేశంలో మొదటి సారి వెలుగుచూసిన డెల్టా వేరియంట్, ప్రస్తుతం బ్రిటన్, అమెరికాలను అతలాకుతలం చేస్తోంది . మనదేశంలో సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగడానికి డెల్టా వేరియంట్ కారణమని అందరికీ తెలుసు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+