గోవా కంటే తక్కువ బడ్జెట్ లో ఈ దేశాలను చుట్టేయొచ్చు..!
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే అందరికీ గోవానే గుర్తుకువస్తుంది. అందమైన బీచ్‌లు.. అక్కడి ప్రకృతి అందాలు, నదులు, జలపాతాలు, అడవులను చూస్తూ కొత్త సంవత్సరాన్ని గ్రాండ్ గా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే డిసెంబర్ 31 న గోవా బీచ్ లో ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉంటాయి. అందుకే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే చాలామంది గోవాకే వెళ్తుంటారు. అయితే గోవాకు వెళ్లగలిగేంత బడ్జెట్ లో వేరే దేశాల్ని చుట్టి రావొచ్చని మీకు తెలుసా..? అవి మన సరిహద్దు దేశాల్ని ఈ కొత్త సంవత్సరం వేళ తక్కువ ధరకే వెళ్లి రావచ్చు.
థాయ్ లాండ్ ప్రముఖ పర్యాటక దేశంగా ఉంది. థాయ్ లాండ్ లోని సముద్ర తీరాలు, అందమైన కొండలు, పచ్చని ప్రకృతి సోయగాలు, ఆహ్లాదకరమైన వాతావరణం.. ఇలా ఎన్నో ప్రాంతాలను థాయ్ లాండ్ లో చూడొచ్చు. అయితే గోవా కంటే తక్కువ బడ్జెట్ లోనే థాయ్ లాండ్ కు వెళ్లి రావొచ్చు. అందమైన బీచ్ లు, రోడ్లు, మార్కెట్లతో పాటుగా ఇక్కడ రుచికరమైన వంటకాలను కూడా ఆస్వాదించవచ్చు. అంతేకాక సమీపంలోని స్థానిక దేవాలయాలను కూడా సందర్శించవచ్చు. థాయ్ లాండ్ లోని ఫుకెట్ నగరంలోని జేమ్స్ బాండ్ ద్వీపం, చియాంగ్ మాయి, సువాన్ డాక్ గేట్, మోంతా థాన్ వాటర్ ఫాల్స్.. ఇలా చాలా ప్రాంతాలను ఎంజాయ్ చేయవచ్చు.
అలాగే భారత్ కు ఆనుకుని ఉన్న మరో దేశం శ్రీలంక. ద్వీప దేశంగా పిలువబడే శ్రీలంకను తక్కువ బడ్జెట్ లోనే చూసి రావచ్చు. అందమైన బీచ్ లు, సాంస్కృతిక ప్రదేశాలు, ప్రకృతి రమణీయమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. శ్రీలంకలో లయన్ రాక్ పర్వతం చాలా ప్రసిద్ధి చెందింది. చుట్టూ దట్టమైన అడవి మధ్యలో ఉన్న పెద్ద కొండపై ఈ కోట ఉంటుంది. అలాగే శ్రీలంకకు దక్షిణ దిక్కున మిరిస్సా బీచ్ ఉంది. ఎల్లా హిల్‌స్టేషన్, బౌద్ధ దేవాలయం, కొలంబో నగరం, యాలా జాతీయ అభయారణ్యం తదితర ప్రాంతాలు కనువిందు చేస్తాయి.
ఇక నేపాల్ పర్వత ప్రాంతంలో ఉంటుంది. నేపాల్ దేశంలో ఖాట్మండు, పోఖర, లుంబిని, చిట్ వాన్ తదితర అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అలాగే హిమాలయ పర్వతాలు, పురాతన బౌద్ధ ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. గోవా కంటే తక్కువ ధరలోనే నేపాల్ దేశానికి వెళ్లి రావచ్చు.

అలాగే వియత్నాం ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా విరాజిల్లుతోంది. ఇక్కడ హనోయి, హుయ్ ఆన్, హో చిన్ మిన్ సిటీ వంటి చారిత్రక నగరాలు ఎన్నో ఉన్నాయి. ఇక వియత్నాంలో ఎగ్ కాఫీ, డ్రాగన్ బ్రిడ్జి, గోల్డెన్ హాండ్స్ బ్రిడ్జ్, హొయాన్ నది, ట్రాంగ్ ఆన్ బోట్ రైడ్, బాన్ జియాక్ వాటర్ ఫాల్స్.. ఇలా అనేక ప్రాంతాలు పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications