వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్షిపణి రక్షణ వ్యవస్థ ప్రయోగం విజయవంతం: నిర్దేశిత లక్ష్యం ఛేదన

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) మరో క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. మధ్యశ్రేణి గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థను విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని బాలేశ్వర్ నుంచి 'ఎంఆర్ఎస్​ఏఎం' క్షిపణి వ్యవస్థ ప్రయోగం చేపట్టింది. నిర్దేశిత లక్ష్యాన్ని క్షిపణి నేరుగా ఢీకొట్టిందని డీఆర్​డీఓ స్పష్టం చేసింది.

ఆదివారం ఉదయం 10.30 గంటలకు ప్రయోగం నిర్వహించినట్లు పేర్కొంది. సుదూరంలో ఉన్న హైస్పీడ్ గగనతల లక్ష్యాన్ని విజయవంతంగా అడ్డుకున్నట్లు తెలిపింది. కాగా, ఇండియా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాయి. భారత్ నుంచి డీఆర్​డీఓ, ఇజ్రాయెల్​కు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్​మెంట్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యమయ్యాయి.

 DRDO test-fires surface-to-air missile, target hit with accuracy

విమానాలు, హిలికాప్టర్లు, యాంటీ షిప్ మిసైళ్లను ధ్వంసం చేసేలా ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను సైతం ఇది అడ్డుకోగలదు. 60 కేజీల వార్​హెడ్లను మోసుకెళ్లే క్షిపణులు ఇందులో ఉంటాయి. 70 కి.మీ. దూరంలోని..
ఇప్పటికే ఈ క్షిపణి వ్యవస్థ వాయుసేన అమ్ముల పొదిలో చేరింది. ప్రస్తుతం సైన్యం కోసం ప్రయోగాలు కొనసాగుతున్నాయి.

కాగా, ఈ క్షిపణి 70 కి.మీ. దూరంలోని లక్ష్యాలను శబ్ద వేగాన్ని మించిన వేగంతో దూసుకెళ్లి ధ్వంసం చేయగలదు. అత్యాధునిక రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్‌ ద్వారా శత్రు విమానాలు, హెలికాప్టర్లు, గైడెడ్‌ బాంబులు, క్రూజ్‌ క్షిపణులను గుర్తించి కూల్చివేస్తుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన డ్యూయల్‌ పల్స్‌ రాకెట్‌ మోటార్‌ని ఇందులో ఉపయోగించారు.

క్షిపణి టెర్మినల్ దశలో అధిక విన్యాసాలను సాధించడానికి స్వదేశీంగా అభివృద్ధి చేసిన రాకెట్ మోటార్, నియంత్రణ వ్యవస్థ ద్వారా శక్తిని పొందుతుంది. ఫైరింగ్ యూనిట్‌లో మిస్సైల్స్, కంబాట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CMS), మొబైల్ లాంచర్ సిస్టమ్స్ (MLS), అడ్వాన్స్‌డ్ లాంగ్ రేంజ్ రాడార్, మొబైల్ పవర్ సిస్టమ్ (MPS), రాడార్ పవర్ సిస్టమ్ (RPS), రీలోడర్ వెహికల్ (RV), ఫీల్డ్ సర్వీస్ వెహికల్ ( FSV).

English summary
DRDO test-fires surface-to-air missile, target hit with accuracy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X