వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Hemanth Soren : హేమంత్ సోరెన్ పై ఈసీ అనర్హత వేటు-గవర్నర్ నోటిఫై చేస్తే-రెండే దారులు

|
Google Oneindia TeluguNews

జార్ఖండ్ లో తనకు తానే గనులు కేటాయించుకున్న వ్యవహారంలో సీఎం హేమంత్ సోరెన్ పై అనర్హత వేటుకు గవర్నర్ కు సిఫార్సు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సోరెన్ ను ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని ఈసీ సిఫార్సు చేసింది. దీంతో ఇప్పుడు ఆయన్ను అనర్హుడిగా ప్రకటించేందుకు గవర్నర్ రమేష్ బైస్ న్యాయ సలహా తీసుకుంటున్నారు.

గవర్నర్ హేమంత్ సోరెన్ అనర్హత ఉత్తర్వులను గెజిట్‌ లో నోటిఫై చేసిన తర్వాత ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆయనతో పాటు ఆయన మంత్రి మండలి కూడా రాజీనామా చేయనున్నారు. అయితే ఆరు నెలల్లోగా ఎన్నికల సంఘం నిర్వహించే ఉప ఎన్నికలో ఆయన మళ్లీ ఎన్నిక కావచ్చు. సోరెన్ ఎమ్మెల్యే పదవికి అనర్హుడని ఈసీ ప్రకటించినట్లు జార్ఖండ్‌లోని సీనియర్ నాయకుడు సరయూ రాయ్ అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ధృవీకరించారు. ఎన్నికల సంఘం @HemantSorenJMMని ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించింది. అనర్హత నోటిఫికేషన్ రాజ్‌భవన్ నుండి వెలువడిన వెంటనే ఆయన రాజీనామా చేయాలి లేదా గౌరవనీయమైన కోర్టు నుండి ఈ నోటిఫికేషన్‌పై స్టే ఆర్డర్ పొందవలసి ఉంటుందని సరయూ రాయ్ హిందీలో ట్వీట్ చేశారు.

ec recommends jharkhand governor to disqualify cm hemanth soren as mla-has two options now

ప్రభుత్వ కాంట్రాక్టును తనకు తానే కేటాయించుకున్నందుకు సోరెన్ పై అనర్హత వేటు పడుతోందని ఈసీ అభిప్రాయపడిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గవర్నర్ ఆదేశాల తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రి ఇవాళ రాంచీలోని తన నివాసంలో యూపీఏ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జార్ఖండ్‌లో ఇటీవలి రాజకీయ పరిణామాలు, ఊహాగానాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ జార్ఖండ్ లో తమ ఎమ్మెల్యేలు రాంచీలో అందుబాటులో ఉండాలని ఆదేశించింది. రేపు ఉదయం 11 గంటలకు సిఎం నివాసంలో యూపీఏ పార్టీల భేటీ జరగనుంది.

English summary
cec has recommended jharkhand governor to disqualify cm hemanth soren as mla after he was allegedy allots mines to himself.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X