వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral:ఆస్పత్రిలోకి గజరాజులు.. వీడియో వైరల్

|
Google Oneindia TeluguNews

గజరాజులు అంటే భయమే.. అవీ కోపంగా ఉంటే పరిస్థితే వేరు. అవును అందుకోసమే ఏనుగుల గుంపు వచ్చినప్పుడు వాటికి దూరంగా ఉంటారు. వాస్తవానికి అటవీ విస్తీర్ణం తగ్గడంతోనే అవీ జనారణ్యంలోకి వస్తున్నాయి. శ్రీకాకుళం, పశ్చిమ బెంగాల్‌కు ఎక్కువ ఏనుగులు వస్తుంటాయి. చాలా సార్లు ఆ వార్తలను మనం చూశాం. ఇప్పుడు మరో ఏనుగుల సమూహం ఆస్పత్రికి వచ్చింది.

జల్పాయిగురి జిల్లాలో గల ఆర్మీ కంటోన్మెంట్‌కు చెందిన ఆస్పత్రికి ఏనుగులు వచ్చాయి. ఆస్పత్రి వార్డులోకి అవీ వచ్చాయి. అవీ సౌండ్ చేయడంతో.. ఒకరు వీడియో తీశారు. దూరం నుంచే ఫుటేజీ తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒకదాని తర్వాత ఒకటి ఏనుగు ఆస్పత్రి కారిడార్లలో తిరుగుతూ కనిపించింది. వీడియోలో రెండు ఏనుగులు కనిపించాయి.

Elephants stroll into hospital ward inside army cantonment

ఇప్పుడే కాదు అంతకుముందు కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. గతంలో డూర్సాలో గల హస్మీరా ఆర్మీ క్యాంటిన్‌లోకి ఏనుగుల గుంపు వచ్చింది. తొండం ఊపుతూ భోజనశాలలోకి వచ్చాయి. ప్రశాంతంగానే వచ్చినా.. కుర్చీలు, బల్లలను పడగొట్టాయి. అక్కడ నానా బీభత్సం చేశాయి. దీంతో పక్కనే ఉన్నవారు పరుగు తీశారు.

గజరాజులు బీభత్సం చేయడంతో సామాన్య జనాలు భయాందోళనకు గురయ్యారు. వాటిని తిరిగి అడవీలోకి తీసుకెళ్తే బాగుంటుందని అనుకున్నారు. వెంటనే అటవీశాఖ రంగంలోకి దిగింది. వాటిని తరలించే ప్రక్రియను చేపట్టింది. కానీ మళ్లీ గజరాజులు వస్తాయెమో అని బిక్కుబిక్కుమని స్థానికులు ఉంటున్నారు.

English summary
clip shared online shows elephants walking inside the ward of a hospital inside an army cantonment in Jalpaiguri district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X