ఏప్రిల్ 29వరకు ఎగ్జిట్ పోల్‌పై బ్యాన్: ఈసీ
ఐదు రాష్ట్రాల ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇవాళ పశ్చిమ బెంగాల్, అసోంలో తొలి విడత పోలింగ్ జరుగుతుంది. అసోంలో మూడు విడతల ఎన్నికలు జరగనున్నాయి. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో ఒకే విడత.. ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ జరగనుంది. పశ్చిమ బెంగాల్‌లో 8 విడతల్లో పోలింగ్ జరుగుతుంది. బెంగాల్‌లో చివరి విడత ఏప్రిల్ 29వ తేదీన పోలింగ్ జరగనుంది. వీటన్నింటి ఓట్ల లెక్కింపు మే 2వ తేదీన చేపడుతారు.
ఎన్నికలు విడతలవారీగా జరగడంతో చివరి విడత ఏప్రిల్ 29వ తేదీన జరగనుంది. అప్పటివరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించొద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. బెంగాల్‌లో 8వ విడత ఏప్రిల్ 29వ తేదీన పోలింగ్ జరిగిన తర్వాత సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాలని కోరింది. మార్చి 27 ఉదయం 7 గంటల నుంచి ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. దీంతో ఈసీ నిషేధం విధించింది.

నిషేధం విధించకుంటే.. ఎగ్జిట్ పోల్ బట్టి ఫలితం మారే ప్రమాదం ఉంది. ఇప్పుడే కాదు ఇదివరకు కూడా చాలా సందర్భాల్లో ఈసీ ఇలానే నిర్ణయాలు తీసుకుంది. చాలా సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ నిజం కాగా.. కొన్ని సందర్భాల్లో అవీ నిజం కాలేదు. కానీ ఓటర్‌పై ప్రభావం చూపిస్తోందని.. ఈసీ కఠినంగా వ్యవహరిస్తోంది.












Click it and Unblock the Notifications