వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్ లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు -ఎగ్జిట్ పోల్స్ లో తేలిందేంటి : సంస్థల వారీగా ఫలితాలు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

పంజాబ్ పోలింగ్ ముగిసే వరకూ అన్ని పార్టీలు హోరా హోరీగా పోరాడాయి. రాష్ట్రంలో జరిగిన బహుముఖ పోరులో ఎవరికి వారు ధీమాగా ఉన్నా.. లోలోపల మాత్రం ఓటరు నాడి పట్టుకోవటం అంత సులువుగా కనిపించ లేదు. 2017 లోనే పంజాబ్ లో పాగా వేసేందుకు ప్రయత్నించిన ఆప్..ఈ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో తొలి స్థానానికి దూసుకొచ్చింది. అన్ని సర్వే సంస్థలు ఆప్ కు 60 సీట్ల పై మాటేనని తేల్చి చెబుతున్నాయి. 2017 లో కాంగ్రెస్ సాధించిన సీట్లు ఈ ఎన్నికల్లో ఆప్ కు బదిలీ అయ్యాయి. అదే విధంగా ఆ ఎన్నికల్లో ఆప్ దక్కించుకున్న సీట్ల సంఖ్య ఇప్పుడు కాంగ్రెస్ కు దక్కింది.

Recommended Video

Exit Polls 2022: Punjab లో AAP, Arvind Kejriwal మ్యాజిక్ Congress స్థానంలో ఆప్ | Oneindia Telugu

ఇక, సర్వే సంస్థల ఫలితాల వారీగా చేస్తే.. మొత్తం 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో.. ఏబీపీ- సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ లో ..ఆప్ 51-61కాంగ్రెస్ 22-28అకాలీదళ్‌+ 20-26భాజపా+ 7-13ఇతరులు 1-5 గా అంచనా వేసింది. అదే విధంగా.. యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం .. ఆప్ 76-90కాంగ్రెస్ 19-31అకాలీదళ్‌+ 7-11భాజపా+ 1-4ఇతరులు 0-2 సీట్లు సాధించనున్నట్లు తేల్చింది. జన్‌ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ లో ఆప్‌ 60-84కాంగ్రెస్‌ 18-31అకాలీదళ్‌+ 12-19భాజపా+ 3-7 సీట్లు వస్తాయని లెక్కలు వేసింది. ఇక.. ఇండియా టుడే వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ లో ఆప్‌ 76-90కాంగ్రెస్‌ 19-31అకాలీదళ్‌+ 0భాజపా+ 0 గా అంచనా వేసింది.

Exit polls predicts AAp may get massive seats in Punjab Elections

దీంతో పాటుగా.. పీ మార్క్ సర్వే ప్రకారం ఆప్‌ 62-70కాంగ్రెస్‌ 23-31అకాలీదళ్‌+ 16-24భాజపా+ 1-3ఇతరులు 1-3 సీట్లు దక్కే అవకాశం ఉంది. చివరగా.. ఆత్మసాక్షి సంస్థ సర్వే మేరకు పరిశీలిస్తే.. ఈ సర్వే మాత్రం ఆప్ కంటే కాంగ్రెస్ కు మెజార్టీ సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఈ సంస్థ..ఆప్‌ 34-38కాంగ్రెస్‌ 58-61అకాలీదళ్‌+ 18-21భాజపా+ 4-5 వస్తాయని అంచనా వేసింది. ఈ నెల 10వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. కానీ, పోలింగ్ జరిగిన నాటి నుంచే ఆప్ నేతలు తమ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు.

English summary
Punjab Exit polls all agencies predicts AAP get absolute majority to form new govt in the state, may get above 60 seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X